Bird Flu: మాసాచుసెట్స్ లోని పెరటి కోళ్లలో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్
సాక్షి లైఫ్ : మాసాచుసెట్స్ రాష్ట్రంలోని డ్యూక్స్ కౌంటీలో గల ఒక పెరటి కోళ్ల ఫారంలో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా(బర్డ్ ఫ్లూ)వైరస్‌ను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన పక్షుల్లో వైరస్ లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో పాటు, నిర్వహించిన పరీక్షల్లో 'పాజిటివ్'గా నిర్ధారణ అయింది. వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు ఇప్పటికే అప్రమత్తమై, సంబంధిత ఫారంలోని కోళ్లను సురక్షితంగా తరలించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
బయోసెక్యూరిటీ తప్పనిసరి అడవి పక్షుల ద్వారా పెంపుడు కోళ్లకు ఈ వైరస్ సోకే అవకాశం ఉన్నందున, వాణిజ్య, పెరటి కోళ్ల పెంపకందారులు కఠినమైన 'బయోసెక్యూరిటీ' నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెంపుడు పక్షులు, అడవి పక్షులతో కలవకుండా చూడాలని, కోళ్ల గూళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని హెచ్చరిస్తున్నారు.
మనుషులకు ప్రాణాపాయం ఉందా..?
ప్రస్తుతానికి మాసాచుసెట్స్‌లో మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ ప్రజలకు దీనివల్ల వచ్చే ముప్పు చాలా తక్కువని పేర్కొంది. అయితే, పక్షులను పెంచేవారు, పౌల్ట్రీ రంగంలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పక్షుల్లో కనిపించే ముఖ్య లక్షణాలు..
అకస్మాత్తుగా పక్షులు మరణించడం.
గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం.
పక్షుల ముఖం, కళ్లు, తల వాపు రావడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
