బాదంపప్పులు ఎలా తీసుకుంటే ఆరోగ్యం అంటే..?
సాక్షి లైఫ్ : ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో "రోజూ కొన్ని బాదంపప్పులు తినడం ద్వారా నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి సహాయపడే సహజ విధానాలు" అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ లో జరిగిన ఈ కార్యక్రమంలోన్యూట్రిషన్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామితోపాటు, ప్రముఖ నటి వాణీ భోజన్, ఆర్ జె ప్రతీకలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను గురించి వారు అనేక విషయాలు చెప్పారు. రోజువారీ ఆహారంలో బాదంపప్పులను చేర్చుకోవడం, నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో కూడా వారు వెల్లడించారు.
నానబెట్టిన బాదంలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అయితే నానబెట్టిన తర్వాత బాదంపై ఉండే పొట్టును కూడా తప్పనిసరిగా తీసుకోవాలని అందులో కూడా మంచి పోషకాలున్నాయని ప్రముఖ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి అన్నారు. చాలా మంది జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, బాదం వంటి సహజ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోషకాహారంలో సమతుల్య విధానాన్ని అనుసరించాలని షీలా కృష్ణస్వామి సిఫార్సు చేశారు.
ఇది కూడా చదవండి..ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్యం..
ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
ప్రస్తుత ప్రపంచంలో ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే బాదం వంటి సహజ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పోషకాహారానికి సమతుల్య విధానాన్ని అనుసరించాలని ఆమె సూచించారు. ఫొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు నిర్వహణలో బాదం సహాయపడుతుందని, బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని, గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్య సంరక్షణకు ఇవి చాలాబాగా పనిచేస్తాయని షీలా కృష్ణస్వామి అన్నారు.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
