ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్యం..   

సాక్షి లైఫ్ : ఢిల్లీలో కాలుష్యం ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఇప్పటికీ ప్రమాదకర స్థితిలోనే ఉంది. అయితే, గత రెండు రోజులుగా ఏక్యూఐ 400 దిగువకు వచ్చింది. ఏక్యూఐ కూడా రెండు రోజుల క్రితం 1000కి చేరుకుంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో విషపూరిత గాలి కారణంగా, ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీతో సహాపలు హాట్ స్పాట్ ప్రాంతాల్లో విషపూరితమైన గాలి ఉంది. ఈరోజు ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో ఏక్యూఐ 400 కంటే తక్కువగా ఉంది. అయితే రెండు రోజుల క్రితం మరింత ప్రమాదకర స్థాయిలో ఉంది.

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 ఢిల్లీ ఎన్ సీఆర్ లో పొగమంచు నుంచి కొంత ఉపశమనం కలిగింది. దట్టమైన పొగమంచు లేకపోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చలి ప్రారంభమైంది. ఈ రోజు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లలో AQI ఎలా ఉందో తెలుసుకుందాం..  

ప్రదేశం ఏక్యూఐ
న్యూఢిల్లీ 313
ITI శారదా, ఢిల్లీ 363
న్యూఢిల్లీ (రెండో ప్రవేశం) 363
ద్వారకా, ఢిల్లీ 362
జహంగీర్‌పురి, ఢిల్లీ 337
నరేలా, న్యూఢిల్లీ 362
సోనియా విహార్, ఢిల్లీ 350
అలీపూర్, ఢిల్లీ 359
నోయిడా, సెక్టార్-1 413
ఘజియాబాద్ 393


ఢిల్లీలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటంలో, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులలో 50 శాతం మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని, 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తారని చెప్పారు. అత్యవసరమైన సేవలు అందించే విభాగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వర్తించదని ఆయన వెల్లడించారు.

ఈ నిర్ణయం అమలు కోసం సచివాలయంలో పర్యావరణ శాఖ, సాధారణ పరిపాలన శాఖ, ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఫిక్కీ, అసోచామ్, సిఐఐ అధికారులతో సమావేశం కూడా నిర్వహించామని మంత్రి తెలిపారు.  

ప్రయివేటు సంస్థలకు కూడా 50 శాతం వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రైవేట్ సంస్థలు తమ కార్యాలయాలను ఉదయం 10.30 లేదా 11 గంటలకు తెరవాలి. అలాగే, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం షటిల్ బస్సు సర్వీసును ప్రారంభించాలని ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు.

 

ఇది కూడా చదవండి..తమలపాకుల కషాయాన్ని అందరూ తాగొచ్చా..?

ఇది కూడా చదవండి..మలబద్దకం నుంచి బయట పడాలంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : air-pollution airpollution respiratory-disease pollution-effect delhi-ncr delhi pollution delhi-pollution new-pollution-problem-hotspots new-delhi air-pollution-in-delhi pollution-in-delhi pollution-level-in-delhi

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com