Virology Research : వైరాలజీ పరిశోధనల్లో 'ఐసీఎంఆర్-ఎన్ఐవీ' అన్ స్టాపబుల్ సక్సెస్..   

షేర్ చేయండి:
Virology Research : వైరాలజీ పరిశోధనల్లో 'ఐసీఎంఆర్-ఎన్ఐవీ' అన్ స్టాపబుల్ సక్సెస్..   

సాక్షి లైఫ్ : భారతదేశంలో వైరాలజీ పరిశోధనలకు పట్టుకొమ్మగా నిలుస్తున్న పుణేలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) తన 74వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దశాబ్దాలుగా ప్రాణాంతక వైరస్‌ల గుర్తింపు, వ్యాక్సిన్‌ల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సంస్థ, శాస్త్రీయ రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

భావి శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం..

వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక విజ్ఞాన యాత్రను నిర్వహించారు. వైరాలజీకి సంబంధించిన ప్రాథమికాంశాలను అర్థమయ్యేలా వివరించారు. వివిధ రకాల వైరస్‌లు, వాటి నిర్మాణం, అవి మనుషులపై చూపే ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.వైరస్‌ల వ్యాప్తికి కారణమయ్యే కీటకాలు (ఇన్సెక్ట్ స్పెసిమెన్స్), వైరస్ వాహకాలుగా ఉండే పక్షుల నమూనాలను విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. రోగాలను త్వరగా గుర్తించేందుకు వినియోగించే 'డయాగ్నస్టిక్ కిట్స్' ఎలా పనిచేస్తాయో శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వివరించారు.

కీలక పరిశోధనలకు వేదిక..

ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలో 'కోవాగ్జిన్' తయారీ నుంచి, ఇటీవల కలకలం రేపుతున్న మంకీపాక్స్, జికా వైరస్ల వరకు ఎన్ఐవీ తనదైన ముద్ర వేసింది. 1952లో స్థాపించబడిన నాటి నుంచి నేటి వరకు దేశ ఆరోగ్య భద్రతలో ఈ సంస్థ రక్షణ కవచంలా పనిచేస్తోందని ప్రముఖులు కొనియాడారు.కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, కొత్త తరం విద్యార్థులలో పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.