ICMR Sensational Report : భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు.. 

సాక్షి లైఫ్ : భారత వైద్య పరిశోధన మండలి (ICMR) విడుదల చేసిన తాజా నివేదిక దేశ ప్రజలను, ఆరోగ్య రంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. భారతదేశంలో అంటువ్యాధులు (Infectious Diseases) పెరుగుతున్న తీరు, కొత్త వ్యాధుల సమూహాలు (Emerging Disease Clusters) పుట్టుకొస్తుండటంపై ఈ నివేదిక హై అలర్ట్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

11.1శాతం నమూనాల్లో ప్రమాదకర క్రిములు.. 

 దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్‌ నెట్‌వర్క్ ల్యాబ్స్‌లో పరీక్షించిన దాదాపు 4.5 లక్షల మంది రోగుల నమూనాల్లో, ప్రతి 9 మందిలో ఒకరికి అంటే 11.1 శాతం మందికి ఏదో ఒక ప్రమాదకరమైన రోగకారక క్రిమి (Pathogen) ఉన్నట్లు తేలింది.

2025 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 10.7%గా ఉన్న అంటువ్యాధుల వ్యాప్తి, రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నాటికి 11.5శాతానికి పెరిగింది. ఇది కేవలం మూడు నెలల వ్యవధిలో 0.8 శాతం పెరుగుదల నమోదు చేయటం ఆందోళనకరం. 

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 191 వ్యాధి సమూహాలను (Disease Clusters) ఐసీఎంఆర్ గుర్తించింది. వీటిలో గవదబిళ్లలు (Mumps), తట్టు (Measles), రుబెల్లా (Rubella), డెంగ్యూ, చికున్‌గున్యా, రోటావైరస్, నోరోవైరస్ వంటి అంటువ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. 

ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా ఐసీఎంఆర్.. 

ఈ పెరుగుదల స్వల్పంగా కనిపించినా, రాబోయే సీజనల్ వ్యాధులకు, కొత్తగా పుట్టుకొస్తున్న ఇన్ఫెక్షన్లకు ఇది ఒక "ముందస్తు హెచ్చరిక (Warning)"గా భావించాలని సీనియర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ త్రైమాసిక మార్పులను పర్యవేక్షిస్తే, భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులు, మహమ్మారులను (Epidemics) సమయానికి నివారించవచ్చని ఐసీఎంఆర్ చెబుతోంది. 

ముఖ్యంగా గుర్తించిన అంటువ్యాధులు..

వ్యాధి రకంగుర్తించిన క్రిమి (Pathogen)ప్రధానంగా కనిపించిన కేసులుతీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ (ARI/SARI)ఇన్‌ఫ్లుయెంజాఏ తీవ్ర జలుబు, శ్వాస సమస్యలుతీవ్ర జ్వరం & రక్తస్రావ జ్వరండెంగ్యూ వైరస్జ్వరం, రక్తస్రావ లక్షణాలుపచ్చకామెర్లు (Jaundice)హెపటైటిస్ఏ కామెర్లు కేసులు, తీవ్ర విరేచనాలు (Diarrhea)నోరోవైరస్డయేరియా వ్యాప్తిఅక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్ (AES)హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (HSV)మెదడు సంబంధిత కేసులు, 

ఐసీఎంఆర్‌ ఇచ్చిన ఈ నివేదిక నేపథ్యంలో, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) పాటించాలని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : seasonal-health-issues icmr-research icmr seasonal-diseases monsoon-seasonal-diseases survey-for-prevention-of-seasonal-diseases infectious-diseases infectious-disease seasonal-foods emerging-viruses new-infectious-disease emerging-health-issues unicef-obesity-report-india
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com