Is Donald Trump Showing Signs of Dementia..? డొనాల్డ్ ట్రంప్‌కు డిమెన్షియా..? అమెరికాడాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!
సాక్షి లైఫ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక స్థితిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఆగిన వేళ, దేశాధినేత మానసిక సామర్థ్యంపై ప్రముఖ అమెరికన్ వైద్య నిపుణుడు డాక్టర్ విన్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. 79 ఏళ్ల ట్రంప్‌లో 'డిమెన్షియా'లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన హెచ్చరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఏమిటా వింత ప్రవర్తన..?
ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణుడు, మెడికల్ అనలిస్ట్ అయిన డాక్టర్ గుప్తా ప్రకారం, ట్రంప్ ఇటీవల కాలంలో ప్రదర్శిస్తున్న ప్రవర్తన సాధారణమైనది కాదు. ఆయన పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవే..గందరగోళం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, అస్తవ్యస్తమైన ధోరణి.మాట్లాడేటప్పుడు సరైన పదాలు దొరక్కపోవడం, తడబడటం. సోషల్ మీడియా వేదికగా అర్థం పర్థం లేని విషయాలను పోస్ట్ చేయడం. ముఖ్యంగా ఈస్టర్ సెలవుల సమయంలో ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలను బలపరుస్తున్నాయని డాక్టర్ గుప్తా అభిప్రాయపడ్డారు.
చికిత్స అవసరం..!
ఇవి కేవలం విడివిడి సంఘటనలు కావు.. ఒక తీవ్రమైన వైద్య సమస్యకు సంకేతాలు. అధ్యక్షుడు అనే హోదాలో ఉన్న వ్యక్తికి తగిన చికిత్స అందాలని మేము కోరుకుంటున్నాము" అని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు. ఈ లక్షణాలు కాలక్రమేణా పెరుగుతున్నాయని, ఇది మేధోపరమైన క్షీణతకు (Cognitive Decline) దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వైట్ హౌస్ గట్టి కౌంటర్..!
అయితే, ఈ ఆరోపణలను అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని, కొందరు 'లిబరల్స్' సృష్టించిన కుట్ర సిద్ధాంతాలని కొట్టిపారేసింది. అధ్యక్షుడి ఆరోగ్యంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. మరోవైపు, ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో.. మొత్తం నాగరికతే పతనమవుతుంది" అంటూ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలు, ఆయన తాజా మానసిక స్థితిపై జరుగుతున్న చర్చకు మరింత ఆజ్యం పోశాయి. ఒక అగ్రరాజ్య అధినేత ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేశాయనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
