బీహార్‌లో మూడు విమానాశ్రయాలలో మంకీపాక్స్ స్క్రీనింగ్..   

షేర్ చేయండి:
బీహార్‌లో మూడు విమానాశ్రయాలలో మంకీపాక్స్ స్క్రీనింగ్..   

సాక్షి లైఫ్ : దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే బీహార్‌లోనూ మంకీ పాక్స్ హెచ్చరికలు జారీ చేశారు. మంకీ పాక్స్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, బీహార్‌లోని దర్భంగా, పాట్నా, గయా విమానాశ్రయాలలో  మంకీపాక్స్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిద్వారా ఇతరదేశాల నుచి వచ్చే వారిని పరీక్షించనున్నారు. ఇతరదేశాల నుంచి  వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖా పేర్కొంది. అనుమానిత రోగులను గుర్తించి ముందుగా వారిని ఐసోలేషన్ ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మంకీ పాక్స్ అనేది ఒక అంటు వ్యాధి. ఇది మనుషులు, జంతువులలో వేగంగా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, దగ్గు.

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..ఒక కిడ్నీతో హెల్తీగా ఉండొచ్చా..? 

 
మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది..?

మంకీ పాక్స్ అనేది ఒక అంటు వ్యాధి, ఇది సోకిన వ్యక్తి లేదా జంతువుతో సంబంధం కలిగి ఉండడం ద్వారా వస్తుంది. మంకీపాక్స్ ఆర్థోపాక్స్ వైరస్ కుటుంబానికి చెందినది. దీని లక్షణాలు మశూచి లక్షణాల వలె ఉంటాయి. 1958లో మంకీ పాక్స్ మొదటిసారిగా జంతువులలో కనిపించింది. కోతులలో మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ కనుగొన్నప్పుడు అంటే1970 సంవత్సరంలో కాంగోకు చెందిన పిల్లలలో మొదటిసారిగా మానవులలో మంకీపాక్స్ గుర్తించారు. కాగా, 1980లో మశూచి నిర్మూలన తర్వాత, ఇది తీవ్రమైన సమస్యగా మారింది.

ఇది కూడా చదవండి..మందులతో పనిలేకుండా అధికరక్తపోటు ఎలా తగ్గుతుంది..?

ఇది కూడా చదవండి..బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

 ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.