Norovirus Outbreak : కరేబియన్ ప్రిన్సెస్'లో నోరోవైరస్ కలకలం: 115 మందికి ఇన్ఫెక్షన్.. హై అలర్ట్..!
సాక్షి లైఫ్ : విహారయాత్ర కోసం బయలుదేరిన క్రూయిజ్ షిప్‌లో 'నోరోవైరస్' ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన 'కరేబియన్ ప్రిన్సెస్' నౌకలో వందకు పైగా కేసులు నమోదు కావడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్ట్ కెనావెరల్ వైపు వెళ్తుండగా, ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
అసలేం జరిగింది..?
ఏప్రిల్ 28న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో మే 7వ తేదీ నాటికి కేసుల సంఖ్య పెరిగింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదికల ప్రకారం..బాధితుల సంఖ్య మొత్తం 3,116 మంది ప్రయాణికుల్లో 102 మంది (3.3శాతం), అలాగే 1,131 మంది సిబ్బందిలో 13 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
ప్రధాన లక్షణాలు..బాధితుల్లో తీవ్రమైన వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నౌక బహామాస్, అరుబా, ప్యూర్టో రికో వంటి ప్రాంతాల్లో పర్యటించి పోర్ట్ కెనావెరల్‌కు చేరుకోనుంది.
అప్రమత్తమైన సిబ్బంది..
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రిన్సెస్ క్రూయిజ్ యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టింది. నౌకలోని అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలివేటర్ బటన్లు, డోర్ హ్యాండిల్స్ వంటి రద్దీగా ఉండే చోట్ల ప్రత్యేక నిఘా పెట్టారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి సెల్ఫ్ సర్వీస్ బఫేలను నిలిపివేసి, సిబ్బంది ద్వారానే ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
నిపుణుల హెచ్చరిక..
నోరోవైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని, కేవలం చేతులు కడుక్కోవడం ద్వారానే దీనిని అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. హ్యాండ్ శానిటైజర్ల కంటే సబ్బుతో చేతులు కడుక్కోవడం ఈ వైరస్ విషయంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ముందస్తు చర్యలు..
ఈ నౌక గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, తదుపరి ప్రయాణానికి ముందు నౌక మొత్తాన్ని సమగ్రంగా 'డీప్ క్లీనింగ్' చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పర్యాటక రంగంలో ఇలాంటి అంటువ్యాధులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. సముద్ర ప్రయాణాలు చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల రాజీ పడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.