70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29, మంగళవారం 70 ఏళ్లు దాటిన పౌరులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని వల్ల దాదాపు 4.50 కోట్ల కుటుంబాలకు చెందిన ఆరు కోట్ల మంది లబ్ధి పొందుతారని, 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ.. పేదలు లేదా ధనవంతులు అయినా ఆయుష్మాన్ కార్డు పొందడానికి అర్హులని తెలిపారు.

 

ఇది కూడా చదవండి..చలికాలంలో చర్మం పొడిబారకుండా ఇంటి చిట్కాలు..

ఇది కూడా చదవండి..వ్యాయామం తర్వాత ఈ పానీయాలు తీసుకుంటున్నారా..?

ఇది కూడా చదవండి..కొవ్వు కాలేయం కోసం ఏ ఆయుర్వేద మూలికలు, నివారణలు సిఫార్సు చేస్తారు..?

 

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపటి నుంచి ఆరోగ్య బీమాను ప్రారంభించనున్నారు. దీని ద్వారా దాదాపు ఆరు కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి పేద, మధ్యతరగతి లేదా ధనవంతుడు, ఆయుష్మాన్ కార్డును పొందేందుకు అర్హులు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత PMJAY కింద ఉన్న ఐదు ఎంప్యానెల్ ఆసుపత్రులలో లక్ష వరకు ఎలాంటి చికిత్స అయినా పొందవచ్చు. సెప్టెంబరు 1, 2024 నాటికి 12,696 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా మొత్తం 29,648 ఆసుపత్రులు PMJAY కింద ఎంపానెల్ అయ్యాయి.

ఈ పథకాన్ని 33 రాష్ట్రాల్లో అమలు.. 

ప్రస్తుతం ఢిల్లీ, ఒడిశా, బెంగాల్ మినహా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు కానుంది. ఆధార్ కార్డ్‌లో నమోదు చేసిన వయస్సు ప్రకారం 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ , సాధారణ వ్యాక్సినేషన్ రికార్డు కీపింగ్ కోసం రూపొందించిన 'యు-విన్' పోర్టల్‌ను కూడా రేపు ప్రధాని ప్రారంభిస్తారు.

 

ఇది కూడా చదవండి..పంచదార క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుందా..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

 

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.