నీలోఫర్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ.. ప్రాణాపాయం నుంచి గర్భిణీని రక్షించిన వైద్యులు..  

సాక్షి లైఫ్ : ఇరవై ఏడు వారాల గర్భిణీకి అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్యులను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న డీహైడ్రేషన్ ముప్పు.. నిపుణుల హెచ్చరిక

టూత్ బ్రష్ ఎందుకు ఎప్పుడు మార్చాలి..?

 

వికారాబాద్‌కు చెందిన 35 ఏళ్ల గర్భిణీ  ఫిబ్రవరి 1న ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తీవ్రమైన రక్తస్రావం కారణంగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు 'G4 ప్లాసెంటా పెర్క్రెటా విత్ బ్లాడర్ ఇన్వెషన్' ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి తల్లికి, బిడ్డకు  ప్రాణాంతకంగా మారింది.

ఈ సమస్య కారణంగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంలో నిలోఫర్ ఆస్పత్రి యూరాలజిస్ట్లు ఎంతో శ్రమించి అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి, ఆమెను ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించారు.


ఈ శస్త్ర చికిత్సలో, ఒక మగ శిశువు జన్మించాడు. శిశువు ప్రస్తుతం ఎన్ఐసియులో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు నీలోఫర్ వైద్యులు వెల్లడించారు.

ఈ అరుదైన శస్త్ర చికిత్సను నీలోఫర్ గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు కలిసి విజయవంతం చేశారని, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.

 

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news telangana-state-health-minister damodar-rajanarsimha health-and-wellness rare-surgery women-wellness damodar-raj-narasimha rare-conditions niloufer-hospital 27-weeks-pregnant life-saving-surgery rare-medical-condition medical-excellence niloufer-hospital-doctors life-saving-treatment
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com