AI-Based Haemodialysis Machine : ఏఐ ఆధారిత డయాలసిస్ యంత్రంతో సరికొత్త విప్లవం..!

సాక్షి లైఫ్ : భారతదేశంలో తయారైన, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత అత్యాధునిక హెమోడయాలసిస్ యంత్రం, 'రెనాలిక్స్ (Renalyx)', కిడ్నీ రోగులకు చౌకగా, సమర్థవంతమైన చికిత్సను అందించడానికి సిద్ధమవుతోంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో (CKD) బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో, బెంగళూరుకు చెందిన రెనాలిక్స్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. (Renalyx Health Systems Pvt. Ltd.) ఈ స్వదేశీ యంత్రాన్ని అభివృద్ధి చేసింది.

 

ఇది కూడా చదవండి.. తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా..? అయితే ఇది దేనికి సంకేతం..?

 

ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

 ఈ యంత్రం చౌకగా అందుబాటులో ఉండటం వలన, పట్టణాలే కాక, గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది రోగులకు డయాలసిస్ చికిత్స సులభతరం అవుతుంది. ఏఐ అండ్ టెలిమెడిసిన్: ఇందులో క్లౌడ్ ఆధారిత టెలి-నెఫ్రాలజీ ప్లాట్‌ఫామ్ ఉంటుంది, ఇది రోగుల డేటాను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏఐ ఆధారిత స్మార్ట్ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చికిత్సలో కచ్చితత్వం, మెరుగైన ఫలితాలు లభిస్తాయి.మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో, భారతదేశంలో తయారైంది.

రెనాలిక్స్ యంత్రం ప్రత్యేకతలు ఏమిటంటే..?  

రూ. 2 లక్షలకే యంత్రం: దిగుమతి చేసుకునే యంత్రాల ధర సుమారు రూ. 8-12 లక్షలు ఉండగా, రెనాలిక్స్ యంత్రం ధరను 70-75 శాతం తగ్గించి రూ. 2 లక్షల లోపు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

పర్యవేక్షణ సులువు.. క్లౌడ్ ఆధారిత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CIS), ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ (EMR) ద్వారా వైద్యులు రోగుల ఆరోగ్య పరిస్థితిని, డయాలసిస్ సెషన్లను సుదూరం నుంచే పర్యవేక్షించవచ్చు.

ఐదు వేల కేంద్రాలు లక్ష్యం.. రెనాలిక్స్ సంస్థ రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో 800 కోట్లకు పైగా పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఐదువేల కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడేవారికి మెరుగైన, అందుబాటులో ఉండే డయాలసిస్ సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని రెనాలిక్స్ సంస్థ చెబుతోంది.

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : artificial-intelligence kidney-health kidney healthy-kidney kidney-failure kidney-related-problems kidney-failure-symptoms signs-of-kidney-disease chronic-kidney-disease kidney-disease kidney-symptoms chronic-kidney-disease-symptoms kidney-disease-treatment what-is-a-kidney-stone kidney-failure-prevention renalyx ai-haemodialysis renalyx-health-systems
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com