హెల్త్ మినిస్టర్ ను కలిసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం..
సాక్షి లైఫ్ : ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. వైద్యుల సమస్యలపై మంత్రికి తెలుపగా ఆయన సానుకూలంగా స్పందించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఉన్నతాధికారులను కూడా కలిశారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సమస్యలను ఆయా అధికారులకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఉద్యోగుల ఐకాసా ఆధ్వర్యంలో వివరించడం జరిగినదని తెలిపారు. ప్రభుత్వ వైద్యుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు, వాటి పరిష్కారం దిశగా పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డా.రవూఫ్,డా.దీన్ దయాల్, డాక్టర్ కృష్ణారావు ,డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రాజు డాక్టర్ రామ్ సింగ్ , డాక్టర్ రమేష్ ,డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
