వ్యాక్సిన్స్ లేవు : నిధుల కోతతో చిన్నారుల ఆరోగ్యానికి పెనుముప్పు.. 

షేర్ చేయండి:
వ్యాక్సిన్స్ లేవు : నిధుల కోతతో చిన్నారుల ఆరోగ్యానికి పెనుముప్పు.. 

సాక్షి లైఫ్ : నిధుల కోతతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు అందాల్సిన వ్యాక్సిన్స్ అందలేదని దాని కారణంగా వారు పెరిగే కొద్దీ అనేక వ్యాధుల బారీన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఈ సంవత్సరం అంతర్జాతీయ సహాయ నిధులు భారీగా తగ్గడం వల్ల అసురక్షిత పిల్లల సంఖ్యను తగ్గించడం మరింత కష్టతరం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం టీకా తీసుకోని 1.4 కోటి మంది పిల్లలలో సగానికి పైగా తొమ్మిది దేశాలకు చెందినవారున్నారు.

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన జాబితా నుంచి అమెరికా  దేశాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఉపసంహరించుకోవడంతో దాదాపు అన్ని మానవతా సహాయాలను స్తంభింపజేయడంతోపాటు తరువాత యూఎస్ ఎయిడ్ ఏజెన్సీని మూసివేయడం వంటి పరిణామాలు నిధుల కొరతకు దారితీశాయి.

గత నెలలో ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, టీకాల కూటమి గావి (Gavi)కి యూఎస్ గతంలో ప్రతిజ్ఞ చేసిన బిలియన్ల డాలర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కెన్నెడీ గతంలో డిఫ్తీరియా, టెటనస్, కోరింత దగ్గు వ్యాక్సిన్ భద్రతపై సందేహాలు లేవనెత్తారు. అయితే, సంవత్సరాల అధ్యయనం, వాస్తవ ప్రపంచంలో ఉపయోగించిన తర్వాత ఈ టీకాలు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవిగా నిరూపణ అయ్యింది.

టీకాల ప్రాముఖ్యత.. 

టీకాలు సంవత్సరానికి 3.5 మిలియన్ల నుంచి 5 మిలియన్ల మరణాలను నివారిస్తాయని యూఎన్ అంచనాలు చెబుతున్నాయి. "వ్యాక్సిన్ల భద్రత గురించి తప్పుడు సమాచారంతో పాటు, సహాయంలో తీవ్ర కోతలు దశాబ్దాల పురోగతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది" అని డబ్ల్యూ హెచ్ ఓ  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.