సాక్షి లైఫ్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 'టమాటా వైరస్' లేదా 'టమాటా ఫ్లూ' (Tomato Flu) కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారుల్లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో తల్లిదండ్రులుఆందోళన చెందుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తొలిసారిగా భారతదేశంలో 'టమాటా వైరస్' 2022 సంవత్సరం మే నెలలో కేరళలో వచ్చింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
వైరస్ లక్షణాలు..?
టమాటా వైరస్ సోకిన పిల్లల శరీరంపై ముఖ్యంగా చేతులు, పాదాలు, అరికాళ్లు, నోటిలో, మెడ కింద ఎర్రటి దద్దుర్లు (Red Rashes) కనిపిస్తాయి. ఇవి క్రమంగా బొబ్బలుగా (Blisters) మారి, నొప్పి, మంటను కలిగిస్తాయి. దీంతో పాటు జ్వరం, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
నిజమైన పేరు (HFMD): వైద్య నిపుణులు ఈ వ్యాధిని 'టమాటా ఫ్లూ' లేదా 'టమాటా వైరస్' అని, హ్యాండ్, ఫూట్, మౌత్ డిసీజ్ (HFMD) అని పిలుస్తారు. ఇది ఎచినోకాకస్ (Echovirus), కాక్సాకీవైరస్ (Coxsackievirus) వంటి వైరస్‌ల వల్ల వస్తుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం అంటే..?
హ్యాండ్, ఫూట్, మౌత్ డిసీజ్(HFMD) ముఖ్యంగా 6 నెలల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారుల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది.
ఆందోళన వద్దు అంటున్న వైద్యులు..
టమాటా వైరస్ అనేది సాధారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్య కాదు. తల్లిదండ్రులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్నాళ్లకు తగ్గుతుంది..?
సరైన జాగ్రత్తలు తీసుకుంటే, ఈ వ్యాధి వారం నుంచి పది రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది.
గుండె, ఊపిరితిత్తులు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లల విషయంలో మాత్రం వైద్యులు మరింత అప్రమత్తంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.
వ్యాప్తి ఎలా? నివారణ చర్యలు ఏమిటి..?
ఈ వైరస్ ప్రధానంగా పరిశుభ్రత లోపం వల్ల వ్యాపిస్తుంది.
వ్యాప్తి: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, అలాగే లాలాజలం (Saliva) వంటి శరీర స్రావాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా సంక్రమిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మల విసర్జన తర్వాత సరిగా చేతులు కడుక్కోకపోవడం దీనికి ప్రధాన కారణం.
నివారణ ఎలా అంటే..?
ఐసోలేషన్: లక్షణాలు కనిపించిన పిల్లలను కనీసం 5-7 రోజుల పాటు ఇంటికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. పిల్లలు తరచుగా చేతులు కడుక్కునేలా చూడాలి. పరిశుభ్రత పాటించేలా ప్రోత్సహించాలి. ఈ వైరస్ సోకిన పిల్లలను స్కూళ్లకు పంపవద్దని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com