పిల్లల టీకాలు, పెద్దల టీకాలపై సీడీసీ (CDC) కొత్త మార్గదర్శకాలు విడుదల..!

సాక్షి లైఫ్ : అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సంస్థ, చిన్న పిల్లలు, పెద్దలకు సంబంధించిన టీకాలపై తాజాగా కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజారోగ్య రక్షణలో భాగంగా వ్యాక్సిన్ల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కొత్త కోవిడ్-19 టీకా: 2024-2025లో మోడెర్నా లేదా ఫైజర్-బయోఎన్‌టెక్ (Moderna or Pfizer-BioNTech) వ్యాక్సిన్ తీసుకోవాలని సీడీసీ సిఫార్సు చేసింది.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

18 ఏళ్లు పైబడిన వారికి: కొత్త కోవిడ్-19 టీకా ఒక డోస్ తీసుకోవాలి.65 ఏళ్లు పైబడిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి: అదనపు డోసులు తీసుకోవాలని సూచించింది.12-17 ఏళ్ల వారికి: నిర్దిష్ట డోసేజీ అవసరాలతో మోడెర్నా, ఫైజర్-బయోఎన్‌టెక్, నోవావాక్స్ టీకాలను సిఫార్సు చేసింది.

శిశువుల్లో RSV రక్షణ: శ్వాసకోశ వ్యాధి (RSV) నుంచి శిశువులను కాపాడేందుకు క్లెస్సోవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ (clesrovimab monoclonal antibodies) ను 8 నెలల లోపు పిల్లలకు అందించాలని సిఫార్సు చేసింది.ఫ్లూ (Influenza) వ్యాక్సిన్: 6 నెలలు ఆ పైన వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంవత్సరానికొకసారి ఫ్లూ టీకా తీసుకోవాలని మరోసారి స్పష్టం చేసింది.

చైల్డ్ వుడ్ టీకా షెడ్యూల్‌లో అప్‌డేట్స్: మీజిల్స్, మమ్స్, రుబెల్లా (MMR), డిఫ్తీరియా, టెటానస్ వంటి సాధారణ వ్యాధుల నుంచి రక్షణ కోసం పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు పిల్లలకు ఇవ్వాల్సిన టీకాల షెడ్యూల్‌ను అప్‌డేట్ చేసింది.

పెద్దల టీకాలు: పెద్దలకు కూడా వారి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి టీడీఏపీ (Tdap) బూస్టర్ షాట్స్, షింగిల్స్, హెచ్‌పీవీ (HPV) వంటి టీకాలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో, ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను రక్షించడంలో అత్యంత కీలకమని సీడీసీ పేర్కొంది. ఆరోగ్య పరిస్థితి, వయస్సు ఆధారంగా సరైన టీకాను తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యనిపుణులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : hpv-vaccine usa america polio-vaccine vaccine measles-vaccine new-guidelines vaccines shingles shingles-vaccine shingles-virus cdc health-guidelines who-guidelines cdc-report
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com