Chronic kidney disease : భారత్‌లో ఆందోళనకరంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి కేసులు.. 

సాక్షి లైఫ్ : భారత దేశంలో ప్రతిఏటా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగు తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుండటం మరింత కలవరపెడుతోంది. 2023లో 13.8 కోట్ల మంది బాధితులు.. ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (Chronic Kidney Disease - CKD) ఇప్పుడు దేశ ఆరోగ్యానికి పెనుసవాల్ విసురుతోంది.

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఓ అధ్యయనం ప్రకారం, 2023 సంవత్సరంలో భారతదేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 13.8 కోట్లకు చేరింది. ఈ గణాంకాలతో ప్రపంచంలో అత్యధిక సీకేడీ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇది మన దేశంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతోంది.

గుండెకూ గండం.. సీకేడీతో పెరుగుతున్న మరణాలు..!

కిడ్నీల పనితీరు తగ్గితే దాని ప్రభావం నేరుగా గుండె ఆరోగ్యంపై పడుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అనేది గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది.

2023లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన గుండె సంబంధిత మరణాల్లో దాదాపు 12 శాతం సీకేడీ కారణంగానే సంభవించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కిడ్నీలు దెబ్బతినడం వల్ల రక్తపోటు (బీపీ) పెరగడం, శరీరంలో వ్యర్థాలు, విషపదార్థాలు పేరుకుపోవడం, ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత వంటి కారణాల వలన గుండెపై భారం పెరుగుతుంది.

 నిర్లక్ష్యం వద్దు..!

సీకేడీ తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, వ్యాధి ముదిరేకొద్దీ సమస్య తీవ్రమవుతుంది. మధుమేహం (షుగర్), అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారు కిడ్నీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. నొప్పి మాత్రలు (Painkillers), అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడకం పూర్తిగా తగ్గించాలి.

ఆహారంలో ఉప్పు (సోడియం) మితంగా వాడాలి.ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడం, తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kidneys-health kidneys kidney healthy-kidney kidney-failure kidney-related-problems kidney-transplant kidney-failure-symptoms symptoms-of-kidney-failure symptoms-of-kidney-disease chronic-kidney-disease kidney-disease chronic-kidney-disease-symptoms kidney-disease-treatment
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com