సాక్షి లైఫ్ : సాధారణంగా శిశువు గర్భంలో కనీసం 37 వారాలు ఉంటేనే ఉత్తమం అని చెబుతారు వైద్యనిపుణులు. కానీ, 37 వారాలు నిండకముందే శిశువు జన్మిస్తే దానిని ముందస్తు ప్రసవం లేదా ప్రీ-టర్మ్ బర్త్ (Preterm Birth) అంటారు. ఇలా పుట్టిన శిశువులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అసలు ముందస్తు ప్రసవానికి గల కారణాలు ఏమిటి? ఈ విషయంలో గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ స్ఫందన పసుపులేటి సాక్షి లైఫ్ అందించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ముందస్తు ప్రసవానికి ప్రధాన కారణాలు (Reasons for Preterm Baby)..
ముందస్తు ప్రసవం జరగడానికి కొన్ని నిర్దిష్ట కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కారణాన్ని కచ్చితంగా గుర్తించలేకపోవచ్చు,ఈ అంశాలు ముందస్తు ప్రసవం ప్రమాదాన్ని పెంచుతాయి.
గత చరిత్ర (Previous History)..
గతంలో ఎప్పుడైనా ముందస్తు ప్రసవం జరిగి ఉంటే, ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఎక్కువ.
బహుళ గర్భాలు (Multiple Pregnancies)..
కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులను మోస్తున్నప్పుడు ముందస్తు ప్రసవాలు సాధారణంగా జరుగుతాయి.
గర్భాశయ సమస్యలు (Uterine Issues)..
గర్భాశయ ముఖద్వారం (Cervix) త్వరగా తెరుచుకోవడం (Cervical Incompetence) లేదా గర్భాశయంలో నిర్మాణపరమైన సమస్యలు ఉన్నప్పుడు.
మెటర్నల్ ఇన్ఫెక్షన్లు (Maternal Infections)..
మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు (UTI), చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, లేదా గర్భాశయంలోని ఇన్ఫెక్షన్లు వంటివి ముందస్తు డెలివరీకి ప్రేరేపించవచ్చు. గర్భం ధరించడానికి ముందు తల్లి బరువు చాలా తక్కువగా ఉండటం. ధూమపానం,మద్యపానం: గర్భధారణ సమయంలో ధూమపానం చేయడం లేదా మద్యం సేవించడం.
దీర్ఘకాలిక వ్యాధులు..
తల్లికి మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (Hypertension) లేదా కిడ్నీ సమస్యలు ఉంటే. ఒక ప్రసవానికి, తదుపరి గర్భధారణకు మధ్య ఏడాది లోపు సమయం ఉంటే ప్రమాదం మరింతగా పెరుగుతుంది. ఐవీఎఫ్ (IVF) ద్వారా గర్భం.. కొన్నిసార్లు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) ద్వారా గర్భం దాల్చినప్పుడు.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com