సాక్షి లైఫ్ : భారతదేశంలో క్యాన్సర్ (Cancer) రోగులకు మరింత మెరుగైన, సమగ్రమైన చికిత్స అందించే దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ (Ministry of Ayush) కీలక అడుగు వేసింది. ఆధునిక చికిత్సలతో పాటు ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి 'ఆయుష్' పద్ధతులను మేళవించి (Integrative Care) చికిత్స అందించే విధానాన్ని దేశవ్యాప్తంగా పెంచాలని నిర్ణయించింది. ఈ 'ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ కేర్' విధానాన్ని పరిశోధనలు, ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా బలోపేతం చేయనుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
పరిశోధనలకు పెద్దపీట..
ఆయుష్ పద్ధతులు క్యాన్సర్ చికిత్సలో, ముఖ్యంగా కీమోథెరపీ (Chemotherapy) రేడియేషన్ (Radiation) వంటి చికిత్సల తర్వాత రోగుల జీవన నాణ్యతను (Quality of Life) మెరుగుపరచడంలో, దుష్ప్రభావాలను (Side effects) తగ్గించడంలో ఎంతవరకు పనిచేస్తాయో నిరూపించడానికి పెద్ద ఎత్తున పరిశోధనలకు నిధులు కేటాయించనుంది. ఆయుష్ పరిశోధనా సంస్థలు, ఆధునిక వైద్య పరిశోధనా సంస్థలు (ICMR వంటివి) కలిసి పనిచేసేలా ప్రోత్సహించడం. దీని ద్వారా ఆయుష్ చికిత్సలకు శాస్త్రీయ ధృవీకరణ లభిస్తుంది.
ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు (Centres of Excellence)..
దేశవ్యాప్తంగా ప్రముఖ క్యాన్సర్ కేంద్రాలలో 'ఆయుష్ ఇంటిగ్రేటివ్ కేర్' విభాగాలు లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు.
సమగ్ర చికిత్స: ఈ కేంద్రాలలో, ఆధునిక వైద్యులు, ఆయుష్ వైద్యులు కలిసి పనిచేస్తారు. క్యాన్సర్ రోగులకు యోగా థెరపీ, ఆయుర్వేద మందులు వంటి వాటిని అందిస్తూ, వారి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడం, నొప్పి నివారణ మరియు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కమ్యూనిటీ ఔట్రీచ్ (Community Outreach)..
క్యాన్సర్ నివారణ, చికిత్సలో ఆయుష్ పద్ధతుల పాత్ర గురించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది ఆయుష్ శాఖ.
ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చర్యలు... క్యాన్సర్ రోగులకు సాంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం కలయికతో కూడిన మెరుగైన చికిత్సా మార్గాలను అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడతాయని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com