సాక్షి లైఫ్ : ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయికి చేరుతుండ టంతో ప్రజలు వడదెబ్బతో పాటు జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్లకుంట్ల ఫీవర్ ఆసుపత్రికి నిత్యం 15 నుంచి 20 గ్యాస్ట్రో కేసులు వస్తుండగా, నీలోఫర్ ఆసుపత్రిలో సుమారు 30 మంది చిన్నారులు ఈ వ్యాధి లక్షణాలతో చేరుతున్నారు. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా గత కొద్ది రోజులుగా అతిసార, ఫుడ్ పాయిజనింగ్ పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య 30శాతం పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
కారణాలు ఏంటంటే..?
ఎండల తీవ్రత వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది ఆహారం త్వరగా పాడవుతోంది. కలుషిత నీరు తాగడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వీటి బారిన పడి తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
వికారం, వాంతులు
విరేచనాలు
కడుపులో నొప్పి, తిమ్మిర్లు
జ్వరం, తీవ్రమైన నీరసం
తలనొప్పి
వేసవిలో లేదా ఆరోగ్య సమస్యలు ప్రబలుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా మనం తాగే నీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాతే తాగడం శ్రేయస్కరం. ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, నిల్వ ఉంచిన లేదా మిగిలిపోయిన ఆహారాన్ని అస్సలు తినకూడదు, బయటి ఆహారం, ముఖ్యంగా రోడ్ల పక్కన అమ్మే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
స్వల్ప లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా..
ఆరోగ్యం కొంచెం క్షీణించినట్లు అనిపించినా లేదా స్వల్ప లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే ఓ ఆర్ ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అనవసరంగా బయట తిరగకపోవడం మంచిది. వీటన్నిటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని పెద్ద అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com