సాక్షి లైఫ్ : మహబూబాబాద్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో అక్టోబర్ 2025లో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటనపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవి అనే వ్యక్తికి చికిత్స అందించడంలో జరిగిన జాప్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన అసంపూర్ణ కౌంటర్ అఫిడవిట్‌పై ధర్మాసనం మండిపడింది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
మానవత్వం లేకుండా..
చిన్నగూడూరు మండలం, జయ్యారం గ్రామానికి చెందిన రవి అనే రోగి అక్టోబర్ 2025లో మహబూబాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే, ఆధార్ కార్డు లేదన్న సాకుతో పాటు, సహాయకులు (Attendant) ఎవరూ లేరన్న నెపంతో ఆసుపత్రి వర్గాలు అతనికి చికిత్స నిరాకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మూడు రోజుల నరకం..చికిత్స అందకపోవడంతో రవి ఆసుపత్రి ప్రాంగణంలోనే మూడు రోజుల పాటు స్పృహలేకుండా పడి ఉన్నారు.
మృతుడిగా భావించి మార్చురీకి..
నాలుగో రోజు అతను మరణించినట్లు భావించిన సిబ్బంది మార్చురీకి తరలించారు. అయితే, మార్చురీలోని పారిశుధ్య సిబ్బంది అతనిలో కదలికలను గమనించి తిరిగి వార్డుకు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
కోర్టు ప్రశ్నల వర్షం..
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఆధార్ కార్డు లేదా సహాయకులు ఉండాలని తాము నిబంధన ఏమీ పెట్టలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, గతంలో తాము ఆదేశించిన సమగ్ర వైద్య విధానం (Policy Guidelines) గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది.
రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కు పౌరుల ప్రాథమిక హక్కు. వైద్య సదుపాయాల కల్పనలో ఇంతటి తీవ్ర నిర్లక్ష్యం వహించడం సరైనది కాదు. కేవలం ఆధార్ అంశానికే పరిమితం కాకుండా, తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారికి వైద్యం అందించే విషయంలో సమగ్ర మార్గదర్శకాలను ఎందుకు సమర్పించలేదు..? అని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి స్థాయి నివేదికను, వైద్య విధాన నిర్ణయాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com