సాక్షి లైఫ్ : కెంటకీలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కెంటకీ (NKY) ప్రాంతంలో ఓ చిన్నారి ఇన్‌ఫ్లుయెంజా (influenza) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో నమోదైన మొదటి చిన్నారుల ఫ్లూ మరణం ఇదేనని ఆరోగ్య అధికారులు ధృవీకరించారు. కెంటన్ కౌంటీకి చెందిన ఈ చిన్నారి ఈ సీజన్‌కు సంబంధించిన ఫ్లూ వ్యాక్సీన్ తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య గతేడాది కంటే ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఫ్లూ నుంచి రక్షణ.. నిపుణుల సూచనలు..
ఫ్లూ అనేది కేవలం సాధారణ జలుబు మాత్రమే కాదని, అది ప్రాణాపాయానికి కూడా దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆరు నెలలు పైబడిన ప్రతి ఒక్కరూ ఏటా ఫ్లూ వ్యాక్సీన్ తీసుకోవడం ఉత్తమం. ఇది తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రి పాలు కావడం నుంచి రక్షణ కల్పిస్తుంది. చేతులను సబ్బుతో తరచుగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా భోజనానికి ముందు, బయటి నుంచి వచ్చిన తర్వాత ఇది మర్చి పోకూడదు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిది.
తాజా పండ్లు, కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
లక్షణాలను ఇలా గుర్తించండి..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వేగంగా ఊపిరి తీసుకోవాల్సి రావడం.
తీవ్రమైన జ్వరం,104 డిగ్రీల ఫారెన్‌హీట్ పైగా ఫీవర్ వస్తుంది.
శరీరం నీలి రంగులోకి మారడం ముఖ్యంగా పెదవులు లేదా ముఖం.
అప్పుడప్పుడు వాంతులు అవ్వడం లేదా డీహైడ్రేషన్ గా అనిపించడం.
ఫిట్స్ రావడం.
జలుబు, జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టినా లేదా దగ్గు మరింత తీవ్రమైనా అశ్రద్ధ చేయవద్దు. సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com