Organ Donation : అవయవ దానంపై కీలక నిర్ణయం.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. 

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా అవయవదాన ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అవయవాల వృథాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘వన్ నేషన్, వన్ పాలసీ’ (ONOP) కింద ఇకపై దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా ‘ట్రాన్స్‌ప్లాంట్ టూరిజం’ అంటే ధనవంతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి  అవయవ దానం పొందడానికి అడ్డుకట్ట పడనుంది. జాతీయ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ గతంలో అవయవ మార్పిడి కోసం తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో స్థానిక ధ్రువీకరణ పత్రం (Domicile) తప్పనిసరిగా ఉండేది. 

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

తాజా నిబంధనలతో ఈ రూల్ ను తొలగించారు. బాధితులు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తమ పేరును నమోదు చేసుకోవచ్చు. నోట్టో ఐడీ.. ప్రతి రోగికి ప్రత్యేకమైన ‘నోట్టో’ (NOTTO) ఐడీ కేటాయిస్తారు. దీనివల్ల ఒకే వ్యక్తి పలు రాష్ట్రాల్లో పేర్లు నమోదు చేసే ‘డబుల్ డిప్పింగ్’ విధానానికి స్వస్తి పలకవచ్చు. అవయవం సేకరించినప్పటి నుండి అది రోగికి చేరే వరకు ప్రతి దశనూ ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. కొత్త కేటాయింపు విధానం (అల్గారిథమ్)అవయవాల కేటాయింపులో ఇప్పుడు ఒక శాస్త్రీయమైన పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టారు.

 ‘నోట్టో’ విడుదల చేసిన 10 అంశాల సలహా పత్రంలోని ముఖ్యాంశాలు.. 

 ప్రాధాన్యత, పాయింట్లు, చిన్నారులు, 18 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత. మహిళలు, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మహిళా రోగులకు అదనపు పాయింట్లు. డయాలసిస్డయాలసిస్‌లో ఉన్న ప్రతి నెలకు ఒక పాయింట్ చొప్పున కేటాయింపు. కుటుంబ సభ్యులుమరణానంతరం అవయవదానం చేసిన వారి బంధువులకు ప్రాధాన్యత.

 ఆధార్‌తో నోట్టో ఐడీ అనుసంధానం తప్పనిసరి. "పాత పద్ధతులను పక్కన పెట్టి, గణిత సూత్రాల (Mathematical scoring) ఆధారంగా అత్యంత అవసరమైన వారికే అవయవం అందేలా ఈ మార్పులు చేశారు. దీనివల్ల ఏ ఆసుపత్రిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా రోగికి న్యాయం జరుగుతుంది" అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : organ central-government central-health-ministry new-guidelines organ-donation organ-donation-awareness organ-donation-campaign organ-donation-impact organ-donation-matters new-rules
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com