WHO Global summit : వైద్య రంగంలో భారత్ మరో ముందడుగు డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ..

సాక్షి లైఫ్ : వైద్య రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. సంప్రదా య వైద్యం ఆధునిక సాంకేతికతను మేళవించి ప్రపంచ ఆరోగ్యానికి కొత్త దిశను చూపడంలో మన దేశం అగ్రగామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన రెండో డబ్ల్యూహెచ్‌ఓ (WHO) గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు.

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

ప్రపంచ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం పెరగడానికి డబ్ల్యూహెచ్‌ఓ సదస్సు ఒక చక్కని వేదికగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సంప్రదాయ వైద్యానికి సాంకేతికత తోడైతే ప్రపంచ ఆరోగ్యం మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.

 గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 'డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్' ఏర్పాటు కావడం భారత్‌కు గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వైద్య సమాచారాన్ని ఒకే చోట చేర్చే కేంద్రంగా నిలుస్తుంది. సంప్రదాయ వైద్యానికి సంబంధించిన శాస్త్రీయ డేటా, విధాన పత్రాలను భద్రపరిచేందుకు అంతర్జాతీయ వేదికగా "ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ లైబ్రరీ"ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

డిజిటల్ హెల్త్ హవా.. 

ఈ సదస్సులో ఏఐ (AI) ఆధారిత పరికరాలు, డిజిటల్ హెల్త్ టెక్నాలజీ, ఆధునిక వెల్‌నెస్ మౌలిక సదుపాయాలను ప్రదర్శించారు. సంప్రదాయ వైద్యం, సాంకేతికత మధ్య కొత్త బంధానికి ఇది నాంది పలికింది.

అంతర్జాతీయ సహకారం.. 

బిమ్‌స్టెక్ (BIMSTEC) దేశాల కోసం దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలను కవర్ చేసేలా ఒక "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. అలాగే, జపాన్‌తో కలిసి సైన్స్, సంప్రదాయ వైద్య పద్ధతులను ఏకీకృతం చేసే దిశగా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news-updates health-news who world-health-organization gujarat medical-technology traditional-medicine pm-modi
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com