లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న పారిశుధ్య లోపం..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల మందికి ఇప్పటికీ సురక్షితమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. ఇప్పటికీ 419 మిలియన్ల మంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. ఈ సంవత్సరం వరల్డ్ టాయిలెట్ డే థీమ్, శానిటేషన్ ఫర్ పీస్, మంచి ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడంలో పారిశుద్ధ్య వ్యవస్థల పాత్ర ప్రాధాన్యత గురించి హైలెట్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
వరల్డ్ టాయిలెట్ డే ను ఎప్పటి నుంచి జరుపుతున్నారు..?
ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం(వరల్డ్ టాయిలెట్ డే) 2001లో ప్రారంభమైంది. 2013లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందింది. సరైన పారిశుధ్యం లేకపోవడం వల్ల పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అసురక్షిత నీరు, పారిశుధ్యంలోపం వల్ల ప్రతిరోజూ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల వెయ్యి మంది మరణాలకు కారణమవుతుంది. మెరుగైన వ్యవస్థలతో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల మంది జీవితాలను రక్షించవచ్చు.
వాతావరణ మార్పులు, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం కారణంగా కాలుష్యంతోపాటు ప్రాణాంతక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బలహీన వర్గాల్లో మరుగుదొడ్లు మహిళలు, బాలికల గౌరవాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి.. B12 విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?
ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?
పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి..
స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్ బిఎం) ద్వారా భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. 2014 నుంచి, ఎస్ బిఎం గ్రామీణ్ కింద 11.73 కోట్ల గృహ మరుగుదొడ్లు నిర్మించారు. 5.57 లక్షలకుపైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) హోదాను సాధించాయి. ఎస్ బిఎం ద్వారా అర్బన్ ప్రాంతాలు కూడా లక్ష్యాలను అధిగమించాయి. దీని ద్వారా 63 లక్షల గృహాలు ,పబ్లిక్ టాయిలెట్లను నిర్మించింది.
ఈ సంవత్సరం భారతదేశం హమారా షౌచలయ్: హమారా సమ్మాన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు నడుస్తుంది. ఈ ప్రచారం అందరికీ టాయిలెట్ సౌకర్యం కలిగించాలనే దానిపై దృష్టి సారిస్తుంది.
ప్రపంచ సవాళ్లు..
ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. 2 బిలియన్లమందికి ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు లేవు. మారుమూల గ్రామాల్లో పిల్లలు బహిరంగ మలవిసర్జన చేసేవారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది. పారిశుధ్యంలోపం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ మంది పిల్లల ప్రాణాలను తీస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..?
ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
