భారతదేశాన్ని మేజర్ మీజిల్స్ హాట్‌స్పాట్‌గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) అండ్ యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) గ్లోబల్ మీజిల్స్(తట్టు) వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశాయి. గణాంకాల ప్రకారం 2023లో 10.3 మిలియన్ కేసులు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 20శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న 57 దేశాలలో ఇండియా ముందువరుసలో నిలిచింది. భారతదేశంలో 65,150 కేసులు నమోదయ్యాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తర్వాత ఇది రెండవ అత్యంత ప్రభావితమైన దేశంగా నిలిచింది.

ఇది కూడా చదవండి..ఇయర్‌బడ్స్,హెడ్‌ఫోన్స్ వినికిడి శక్తిని ఎలా దెబ్బతీస్తాయి..?

ఇది కూడా చదవండి..ఎక్కువ సౌండ్ కి, వినికిడి లోపాలకు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..B12 విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?

ఇది కూడా చదవండి..లివర్ ఫెయిల్యూర్ విషయంలో మీ శరీరంలో కనిపించే హెచ్చరికలు.. 

 

మీజిల్స్ ను రుబియోలా అని తట్టు అని కూడా అంటారు. ఇది అంటువ్యాధి. వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి , చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. రోగనిరోధకత ద్వారా నివారించగలిగినప్పటికీ, ఈ వ్యాధి మెదడు వాపు వస్తే మరణంతో సహా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ సంబంధిత మరణాలు 8శాతం పెరిగాయి. గతేడాది మొత్తం 107,500 మరణాలు సంభవించాయి.

 -65,000+ కేసులతో 57 దేశాలతోపోలిస్తే రెండవ స్థానంలో భారతదేశం
- మేజర్ మీజిల్స్ హాట్‌స్పాట్ గా ఇండియా 
-  మీజిల్స్ నివారణకు మరింతగా చర్యలు చేపట్టాలని సూచించిన డబ్ల్యూ హెచ్ ఓ, సిడిసి. 

 ప్రపంచవ్యాప్తంగా 2023లో 22.2 మిలియన్ల మంది పిల్లలు మొదటి టీకా తీసుకోలేదు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది 2శాతం మంది టీకా తీసుకోలేదు. ముఖ్యంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలు అత్యధిక సంఖ్యలో చిన్నారులు మీజిల్స్ టీకా వేసుకోలేదు. దీని వల్లే ఆయా దేశాల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. 

డబ్ల్యూ హెచ్ ఓ, సిడిసి మీజిల్స్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పాయి. రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు అవసరమైన ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ,మీజిల్స్ డిసీజ్ వల్ల కలిగే అంతరాయాలను పరిష్కరించాలని దేశాలను కోరాయి. భారతదేశానికి, వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థలను బలోపేతం చేయడం, రోగనిరోధకత ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మీజిల్స్ ముప్పును తగ్గించవచ్చని డబ్ల్యూ హెచ్ ఓ, సిడిసిలు వెల్లడించాయి.  

 

ఇది కూడా చదవండి..డైట్‌ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?

ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : who who-report who-report-2024 measles-vaccine measles what-is-measles measles-disease measles-rash measles-treatment measles-symptoms diagnose-measles measles-diagnosis measles-is-caused-by measles-news measles-outbreak measles-mumps-rubella measles-outbreak-news measles-(disease-or-medical-condition) measles-transmission measles-osmosis measles-explained cdc
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com