Scrub Typhus : హిమాలయాల్లో  కలకలం రేపుతున్న 'స్క్రబ్ టైఫస్'..

సాక్షి లైఫ్ : ప్రశాంతమైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇప్పుడు ఒక వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 'స్క్రబ్ టైఫస్' అనే జూనోటిక్ డిసీజ్ (జంతువుల నుంచి మనుషులకు సోకేది) పర్వత ప్రాంత గ్రామీణ ప్రజలను వణికిస్తోంది. ఒకప్పుడు కనుమరుగైందను కున్న ఈ వ్యాధి, ఇప్పుడు సరికొత్త రూపంలో మళ్లీ పంజా విసురు తుండటం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ వ్యాధి..? ఎలా వ్యాపిస్తుంది..?

'ఓరియెంటియా సుత్సుగాముషి' అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది ప్రధానంగా ఎలుకలపై నివసించే 'చిగ్గర్స్' అంటే లార్వా దశలో ఉన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుంది. ఇవి చాలా చిన్నగా ఉండి, కంటికి సరిగ్గా కనిపించవు. పొదలు, పచ్చిక బయళ్లు, తోటల్లో తిరిగేటప్పుడు ఇవి మనుషులను కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎందుకు పెరుగుతోంది..?

హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేత, మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఎలుకల సంచారం వల్ల ఈ వ్యాధి విస్తరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాంటేషన్లు, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రధాన లక్షణాలు..?

 నల్లి కుట్టిన చోట సిగరెట్ కాలిన గాయం లాంటి నల్లటి మచ్చ ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఇది నొప్పి ఉండదు.

 అకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, తలనొప్పి.

ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, నీరసంగా అనిపించడం.

సరైన సమయంలో చికిత్స అందకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.


నివారణే మార్గం..

 పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఒంటిని పూర్తిగా కప్పేలా పొడవాటి చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి.

ఇంటి చుట్టుపక్కల పొదలు పెరగకుండా చూసుకోవాలి. ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలి.

 జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే సాధారణ యాంటీబయాటిక్స్‌తో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : new-virus himalayan-region himachal scrub-typhus-symptoms scrub-typhus-prevention
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com