మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కనిపించే 10 లక్షణాలు.. 

షేర్ చేయండి:
మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కనిపించే 10 లక్షణాలు.. 

సాక్షి లైఫ్ : మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం లాగే చాలా ప్రధానమైంది. ఒత్తిడి, ఆందోళన, లేదా ఇతర మానసిక సమస్యలు మొదట్లో సాధారణంగా అనిపించినా, వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కనిపించే ప్రమాదం ఉందని మానసిక వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆయా లక్షణాలను గమనించిన వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

 నిరంతర ఆందోళన లేదా ఒత్తిడి.. 

చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆందోళన చెందడం లేదా నిరంతరం ఒత్తిడిలో ఉండడం మానసిక ఆరోగ్య సమస్యలకు కారణాలు కావచ్చు.

 నిద్రలేమి లేదా అతినిద్ర.. 

నిద్ర పట్టకపోవడం, తరచూ మేల్కొనడం, లేదా అతిగా నిద్రపోవడం వంటి నిద్ర సమస్యలు డిప్రెషన్ లేదా ఆందోళన రుగ్మతల సంకేతాలు.

 ఆసక్తి కోల్పోవడం.. 

ఇష్టమైన కార్యకలాపాలు, సామాజిక సంబంధాలు, లేదా రోజువారీ పనులపై ఆసక్తి కోల్పోవడం మానసిక సమస్యల లక్షణం కావచ్చు.

  తీవ్రమైన మూడ్ స్వింగ్స్..  

అకారణంగా ఒక్కోసారి సంతోషం, మరోసారి దిగులు లేదా కోపంగా ఉండడం బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలు కనిపిస్తాయి.

 ఆకలి లేదా బరువులో మార్పులు..  

ఆకలి తగ్గడం, అతిగా తినడం, లేదా ఊహించని విధంగా బరువు తగ్గడం లేదా పెరగడం మానసిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉండవచ్చు.

 ఏకాగ్రత లోపం..  

పనిలో లేదా రోజువారీ కార్యకలాపాలలో ఏకాగ్రత కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ వంటివి మానసిక సమస్యలను సంకేతాలే.

  నొప్పులు..  

 తలనొప్పి, శరీర నొప్పులు, లేదా కడుపు సమస్యలు మానసిక ఒత్తిడితో సంబంధం కలిగి ఉండవచ్చు.

 ఒంటరితనం కోరుకోవడం.. 

సామాజిక సంబంధాల నుంచి దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం డిప్రెషన్ లేదా సామాజిక ఆందోళన రుగ్మతలకు గురికావడం.

 అతిగా ఆలోచించడం..  

ఒకే విషయాన్ని లేదా భయాన్ని పదేపదే ఆలోచించడం ఓసీడీ (అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్) లేదా ఆందోళన రుగ్మతల సంకేతం.

జీవితంపై ఆసక్తి కోల్పోవడం.. 

జీవితంపై ఆసక్తి కోల్పోవడం, ఆత్మహత్య గురించి ఆలోచించడం, లేదా ఇతరులతో ఈ ఆలోచనలను పంచుకోవడం తీవ్రమైన మానసిక సమస్యల సూచన. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసు కోవాలి. ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని తేలిగ్గా తీసుకోకుండా మానసిక వైద్య నిపుణుడిని లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి.  

ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు.. 

ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు.. 

ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.