A Powerful Mantra to Drive Away Stress : స్ట్రెస్ ను తరిమికొట్టే మంత్రం.. ఇదిగో.. : పరిశోధకుల వెల్లడి

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి యాంత్రిక జీవనంలో మనిషి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటున్నాడు. ఈ క్రమంలో మానసిక ప్రశాంతత కరువై, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే, పాత కాలపు అలవాట్లుగానీ అభిరుచులు గానీ (Old Hobbies) మన మెదడుకు గొప్ప విశ్రాంతిని ఇస్తాయని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

 

ప్రశాంతతనిచ్చేవి ఇవే..

కేవలం స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోకుండా, మనసుకు నచ్చిన పనుల్లో నిమగ్నం కావడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

సృజనాత్మక కళలు (Creative Arts)..

 చిత్రలేఖనం, కవితలు రాయడం లేదా సంగీత వాయిద్యాలను నేర్చుకోవడం వల్ల మెదడులో 'డోపమైన్' అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనస్సును ఉత్తేజితం చేస్తుంది.

ప్రకృతితో మమేకం అవ్వడం (Nature & Gardening)..

 మొక్కలు పెంచడం, ఉదయాన్నే పక్షుల కిలకిలారావాల మధ్య నడవడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన 'కార్టిసాల్' స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు ప్రకృతిలో గడపడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

పురాతన వస్తువుల పునరుద్ధరణ (Restoration).. 

పురాతన వస్తువులను రిపేర్ చేయడం లేదంటే వాటిని రంగులు వేయడం వంటి పనులు ఏకాగ్రతను పెంచడమేకాకుండా, మనసును ఇతర ఆందోళనల నుంచి మళ్లిస్తాయి.

సేకరణ (Collecting).. 

నాణేలు, స్టాంపులు లేదా పుస్తకాల సేకరణ వంటి అలవాట్లు క్రమశిక్షణను, కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచుతాయి.

 ప్రయోజనాలు..? 

ముఖ్యంగా క్లబ్‌లు లేదా గ్రూపుల్లో చేరి తమకు నచ్చిన పనులు చేయడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడి, ఒంటరితనం అనే భావన తొలగిపోతుంది. ఇష్టమైన పనిని చేస్తున్నప్పుడు మెదడు పూర్తిగా దానిపైనే కేంద్రీకరించడం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఏదైనా ఒక పెయింటింగ్‌ వేసినా లేదా మనం పెంచుకున్న మొక్కకు   పువ్వు పూసినా కలిగే ఆనందం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.


రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు మీకు నచ్చిన పని చేయడానికి కేటాయించండి. అది వంట చేయడం కావచ్చు, పుస్తకం చదవడం కావచ్చు లేదంటే కుట్టుపని కావచ్చు. ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తే అది గొప్ప మెడిటేషన్‌లా పనిచేస్తుందని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.