మహిళలు, తక్కువ ఆదాయ కుటుంబాలలోనే డిప్రెషన్ కేసులు ఎక్కువ..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అమెరికాలో డిప్రెషన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు తక్కువ ఆదాయ కుటుంబాలు ఈ మానసిక ఆరోగ్య సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే..?

ఇది కూడా చదవండి..దాల్చిన చెక్క నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ 5 చిట్కాలు.. 

 

12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిలో 13శాతం మంది డిప్రెషన్ లక్షణాలను ఎదుర్కొంటున్నారని, ఇది గత దశాబ్దంతో పోలిస్తే 8శాతం నుంచి పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతున్నారు, వీరిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఎక్కువమంది మానసిక సమస్యల బారీన పడుతున్నారు. డిప్రెషన్ ఉన్నవారిలో 87.9శాతం మంది పని, ఇంటి వ్యవహారాలు, సామాజిక కార్యకలాపాల్లో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ఈ అధ్యయనం ప్రకారం, డిప్రెషన్ ఉన్నవారిలో కేవలం 39.3శాతం మంది మాత్రమే గత 12 నెలల్లో మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి కౌన్సెలింగ్ లేదా థెరపీ వంటివి తీసుకుంటున్నారు. డిప్రెషన్ నివారణకు తగిన చికిత్స, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని, అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?

 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.