Gen Blend Relationships : జెన్ బ్లెండ్ రిలేషన్ షిప్.. అనేది నేటి తరానికి వరమా..? శాపమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. అయితే, భాగస్వాముల మధ్య వయసు వ్యత్యాసం భారీగా ఉన్నప్పుడు అది కేవలం వ్యక్తిగత విషయంగా మిగిలిపోయే అంశంమాత్రమే కాదని, సామాజిక, మానసిక, శారీరక సవాళ్లతో ముడిపడి ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతలో ప్రాచుర్యం పొందుతున్న ‘జెన్ బ్లెండ్’ ట్రెండ్ నుంచి.. మారుతున్న జీవనశైలి వరకు ఈ బంధాల వెనుక ఉన్న వాస్తవాలపై ప్రత్యేక కథనం..

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

‘జెన్ బ్లెండ్’ అంటే ఏమిటి..?

ప్రస్తుతం డేటింగ్ విషయంలో ‘జెన్ బ్లెండ్’ (Gen Blend) అనే పదం బాగా వినిపిస్తోంది. తమ కంటే పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు తేడా ఉన్న వ్యక్తులతో డేటింగ్ చేయడాన్ని లేదా సంబంధం కలిగి ఉండటాన్ని ఇది సూచిస్తుంది.

మారిన దృక్పథం.. 

ఒకప్పుడు పురుషుడు పెద్దవాడు, స్త్రీ చిన్నదిగా ఉండటం ఆచారంగా ఉండేది. కానీ ‘జెన్ బ్లెండ్’లో యువకులు వయసులో పెద్దవారైన మహిళల పట్ల, అలాగే యువతులు తమ కంటే చాలా పెద్దవారైన పురుషుల పట్ల ఆకర్షితులవుతున్నారు. యువత ఈ తరహా బంధాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక స్థిరత్వం, మానసిక పరిపక్వత.
వయసులో పెద్దవారైన భాగస్వామి సాధారణంగా కెరీర్‌లో స్థిరపడి ఉంటారు. ఇది ఆర్థిక పరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది.

భావోద్వేగ పరిపక్వత.. 

జీవితానుభవం ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు తరాలకు చెందిన వారు కావడంతో ఒకరికొకరు కొత్త విషయాలను నేర్పించుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ భాగస్వాముల మధ్య కొన్ని కీలక వ్యత్యాసాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు:

శక్తి సామర్థ్యాలు..  

20 ఏళ్ల యువతికి ఉన్న ఉత్సాహం, 40 ఏళ్ల వ్యక్తికి ఉండకపోవచ్చు. శారీరక శ్రమ అవసరమైన పనులు లేదా విహారయాత్రల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. వయసు ప్రభావం శారీరక సామర్థ్యంపై పడుతుంది. ఇది దీర్ఘకాలంలో శృంగార జీవితంలో అసంతృప్తికి దారితీయవచ్చు.

తరాల అంతరం (Generation Gap).. 

అభిరుచులు, తీసుకునే నిర్ణయాలు, చూసే సినిమాలు లేదా వినే సంగీతం విషయంలో 'జనరేషన్ గ్యాప్' వల్ల కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తవచ్చు. వయసులో పెద్దవారు కావడంతో, చిన్నవారిపై తెలియకుండానే అధికారాన్ని చెలాయించే ప్రమాదం ఉంది.

విడాకుల ముప్పు..?

 వయసు వ్యత్యాసం పెరిగే కొద్దీ బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎమోరీ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

5 ఏళ్ల వ్యత్యాసం..18శాతం విడాకుల ముప్పు.

10 ఏళ్ల వ్యత్యాసం..39శాతం ముప్పు.

20 ఏళ్ల వ్యత్యాసం.. 95శాతం వరకు విడాకులు తీసుకునే అవకాశం ఉంది.

సైకాలజిస్టులు ఏమంటున్నారు అంటే..?

సమాజంలో ఇలాంటి సంబంధాలు ఇంకా పూర్తిస్థాయిలో ఆమోదం పొందలేదు. ఒకరు 20 ఏళ్లలో, మరొకరు 40 ఏళ్లలో ఉన్నప్పుడు వారి జీవిత లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. వయసు వ్యత్యాసం ఉన్న బంధంలో అడుగుపెట్టే ముందు కేవలం ఆకర్షణను మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు, సామాజిక ఒత్తిడి, పిల్లల బాధ్యతలను ఎదుర్కోగలమా..? లేదా అని ఆలోచించుకోవాలి. పరస్పర గౌరవం, పారదర్శకమైన సంభాషణ ఉన్నప్పుడే ఏ బంధమైనా నిలబడుతుందని ప్రముఖ సైకాలజిస్ట్ డా.హిప్నో పద్మకమలాకర్ చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.