అనోరెక్సియా నెర్వోసా అంటే..? లక్షణాలు-కారణాలు..? 

షేర్ చేయండి:
అనోరెక్సియా నెర్వోసా అంటే..? లక్షణాలు-కారణాలు..? 

సాక్షి లైఫ్: చాలా మంది బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటారు. కానీ కొంతమందిలో ఎక్కువగా ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతామనే ఆందోళన తలెత్తుతుంది. ఫలితంగా అనోరెక్సియా నెర్వోసా అనే పరిస్థితి వస్తుంది. అనోరెక్సియా నెర్వోసా అనేది తినే రుగ్మత, ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి దారితీస్తుంది.  

అనోరెక్సియా నెర్వోసా.. 

అనోరెక్సియా నెర్వోసా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటారు. బరువు పెరుగుతారనే భయంతో ఉంటారు. వారు బరువు తగ్గినప్పుడు తమ గురించి గొప్పగా ఫీలవుతుంటారు. ఊబకాయ సమస్య రాకుండా, అతిగా వ్యాయామం చేస్తూ ఉంటారు. అనోరెక్సియా సాధారణంగా కౌమారదశలో ఉన్న మహిళల్లో ,వృద్ధులు, యువకుల్లో కూడా వస్తుంది.

ఇది కూడా చదవండి..  ఎండాకాలంలో ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..? 

బరువు పెరుగుతాననే భయం.. 

అనోరెక్సియా నెర్వోసా అనేది ఒక రకమైన తినే రుగ్మత. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి అన్ని వేళలా తినడు కానీ ఆహారానికి దూరంగా ఉంటాడు. తక్కువ తిన్నప్పటికీ, బరువు పెరుగుతాననే భయంతో ఉంటాడు. ఈ సమస్యతో బాధపడేవారు ప్లేటులో ఆహారం తీసుకుంటారు కానీ సరిగా తినరు. సరిగ్గా తినకపోతే బలహీనంగా మారడం సహజం. ఈ రుగ్మత గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..  

ఆహారం తీసుకోకపోవడం వల్ల.. 

తక్కువ ఆహారం తీసుకోవడం లేదా ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరానికి అవసరమైన అనేక పోషకాల కొరత ఏర్పడుతుంది. తద్వారా   ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితి మహిళలకు మరింత తీవ్రంగా ఉంటుంది.  

అనోరెక్సియా నెర్వోసా లక్షణాలు

- ఆకస్మిక బరువు తగ్గడం

- అలసట, విశ్రాంతి లేకపోవడం

- నిద్రలేమి

- చర్మంపై మచ్చలు 

- జుట్టు రాలడం

- మలబద్ధకం

- చేతులు ,కాళ్ళలో వాపు

- చర్మం పొడి బారడం 

- రక్తపోటు తగ్గుతుంది

- తినకపోయినా కడుపు ఉబ్బినట్లు అనిపించడం

- పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు

- అతిగా వ్యాయామం చేయడం

- చిరాకు

- అన్ని వేళలా విచారంగా ఉండటం

- తినాలని అనిపించదు

- లావుగా ఉన్నట్లు అనుభూతి చెందుతూ ఉండడం

- స్నేహితులు,సామాజిక పరిచయాల నుంచి ఉపసంహరణ

- డిప్రెషన్ లక్షణాలు

నివారణ చర్యలు..? 

స్త్రీ అయినా, పురుషుడైనా ఈ సమస్యతో బాధపడుతుంటే..? వారిని రక్షించడానికి శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో వారికి తెలియజేయాలి.  అతిగా తిన్నప్పుడు ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని అలాంటి వారికి చెప్పాలి. సరైన మోతాదులో సరైన సమయంలో తినే వారిలో ఎలాంటి సమస్యలు రావని వివరించాలి. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండమని, పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని అనోరెక్సియా నెర్వోసా సమస్య ఉన్నవారికి తెలియజేయాలి.

ఇది కూడా చదవండి.. కస్టమర్లను తప్పుదారి పట్టించవద్దని ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ 

 ఇది కూడా చదవండి.. ఆటిజం ఉన్న చిన్నారులతో ఎలా ఉండాలి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.