Protein & Fiber : ప్రొటీన్లు, పీచు పదార్థాలతోనే రోజంతా ఉత్సాహం.. అశ్రద్ధ చేస్తే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే..!

సాక్షి లైఫ్ : రోజువారీ పనుల ఒత్తిడిలో చాలామంది అల్పాహారాన్ని (breakfast) తూతూమంత్రంగా ముగిస్తుంటారు. మరికొందరు రుచికి ప్రాధాన్యత ఇచ్చి పోషకాలను విస్మరిస్తుంటారు. అయితే, రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో అల్పాహారమే అత్యంత కీలకమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన పోషకాలు లేని అల్పాహారం తీసుకోవడం వల్ల త్వరగా అలసట రావడం, మెదడు చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీ అల్పాహారాన్ని పోషకాల గనిగా మార్చుకోవాలంటే అందులో ఏయే అంశాలు ఉండాలో తెలుసుకోండి..

 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

కండరాల పుష్టికి.. ప్రొటీన్లు.. 

అల్పాహారంలో ప్రొటీన్లు (proteins) అధికంగా ఉండటం వల్ల కండరాలు బలోపేతం కావడమే కాకుండా, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్ వంటి పదార్థాల్లో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. శాఖాహారులు వాల్‌నట్స్, బాదం వంటి గింజలను కూడా చేర్చుకోవచ్చు. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడాలంటే.. పీచు.. 

మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే అల్పాహారంలో పీచు పదార్థం తప్పనిసరి. ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, తాజా పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి.

పీచు అధికంగా ఉండే ఆహారం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉండటంతో పాటు శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

రోగనిరోధక శక్తికి.. విటమిన్లు.. 

తాజా పండ్లు, ఆకుకూరలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటివి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎముకల పుష్టికి, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మెదడు పనితీరుకు.. కొవ్వులు.. 

శరీరానికి చెడు కొవ్వులు హానికరమే కానీ, మంచి కొవ్వులు (Healthy Fats) అత్యవసరం. అవకాడో, వాల్‌నట్స్, బాదం వంటి వాటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

మర్చిపోవద్దు.. నీటి శాతం.. 

అల్పాహారంతో పాటు లేదా ఆ తర్వాత గ్రీన్ టీ, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచి, మిమ్మల్ని రోజంతాఉత్సాహంగా ఉంచుతుంది. ఉదయం తీసుకునే ఈ సమతుల్య ఆహారమే రేపటి మీ ఆరోగ్యానికి పునాది అని గుర్తుంచుకోండి. 

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : protein-food protein best-food best-diet fiber-deficiency fiber fiber-food fiber-in-grapes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com