WHO Analysis : 38 శాతం క్యాన్సర్‌ కేసులు నివారించదగ్గవే.. డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : క్యాన్సర్ అనగానే భయపడే రోజులు పోయాయి. కేవలం మన అలవాట్లను మార్చుకోవడం ద్వారా లక్షలాది క్యాన్సర్ కేసులను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 38 శాతం కేవలం జీవనశైలి మార్పులు, పర్యావరణ జాగ్రత్తల ద్వారా అడ్డుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

పొగాకే ప్రధాన శత్రువు.. 

మొత్తం నివారించదగ్గ క్యాన్సర్ కారకాల్లో పొగాకు (Tobacco) మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం క్యాన్సర్ కేసులు నేరుగా ధూమపానం వల్లే సంభవిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పురుషుల్లో ఎక్కువ..

పురుషుల్లో నమోదవుతున్న కొత్త క్యాన్సర్ కేసుల్లో 23 శాతం పొగాకు వల్లే వస్తున్నాయని పరిశోధనలో తేలింది. ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లకు ఇదే ప్రధాన కారణం. మద్యపానం.. పొగాకు తర్వాత అత్యంత ముప్పు కలిగించేది మద్యం (Alcohol). ఏటా సుమారు 7 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు మద్యం సేవించడం వల్లే వస్తున్నాయి. కాలేయం, రొమ్ము, ఆహార వాహిక క్యాన్సర్లకు మద్యం ప్రధాన కారకంగా మారుతోందని అధ్యయనం హెచ్చరించింది.

 పర్యావరణ కాలుష్యం..

మనం నివారించగల మరో 10 శాతం క్యాన్సర్ కేసులు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తున్నాయి. మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార (Cervical) క్యాన్సర్‌కు 'హ్యూమన్ పాపిల్లోమా వైరస్' కారణం. దీనికి టీకా అందుబాటులో ఉన్నప్పటికీ, అవగాహన లేక చాలామంది ప్రమాదంలో పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతంలో మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వాయు కాలుష్యం (Air Pollution) ప్రధాన కారణమని గుర్తించారు.

ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటే..?

కేవలం వ్యక్తిగత అలవాట్లు మార్చుకోవడం ద్వారానే కాకుండా, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల ద్వారా కూడా క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.హెచ్‌పీవీ, హెపటైటిస్-బి వంటి టీకాలు వేయించడం ద్వారా ఆయా క్యాన్సర్లను నివారించవచ్చు. అధిక శరీర బరువు (BMI) కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. సరైన వ్యాయామం అవసరం.

సురక్షితమైన నీరు, పారిశుధ్యం పాటించడం ద్వారా కడుపు (Stomach) క్యాన్సర్లను తగ్గించవచ్చు. మనం మార్చుకోగల 30 రకాల అంశాల వల్లే 38 శాతం క్యాన్సర్లు వస్తున్నాయి. అంటే ఏటా 70 లక్షలకు పైగా ప్రాణాలను మనం కాపాడుకోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ క్యాన్సర్ కంట్రోల్ టీమ్ లీడర్ డాక్టర్ ఆండ్రీ ఇల్బావి చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.