సాక్షి లైఫ్ : మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే, చింతించాల్సిన అవసరంలేదు. ప్రకృతి మనకు ఈ సమస్యను పరిష్కరించగల అనేక కూరగాయలను ఇచ్చింది. అవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా ఉంటాయి. అలాంటి ఐదు రకాల కూరగాయలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం, కానీ దాని స్థాయిలు పెరిగితే ఆరోగ్యానికి హాని జరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ధమనులు మూసుకుపోతాయి. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. అవును, మందులు కాకుండా, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అనేవి కూడా తప్పనిసరి.
ఇది కూడా చదవండి..తమలపాకుల కషాయం తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత పురుషుల్లో వచ్చే 6 ప్రధాన వ్యాధులు..
ఇది కూడా చదవండి..సమతుల్య ఆహారంలో గింజలు, విత్తనాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?
క్యారెట్..
క్యారెట్‌లో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు, కరిగే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇది కాకుండా, విటమిన్ ఎ సమృద్ధిగా ఉన్న క్యారెట్ కంటి చూపు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. మీరు దీన్ని సలాడ్ లేదా ఇతర వంటలలో చేర్చడం ద్వారా మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
సొరకాయ..
సొరకాయలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అంతేకాదు కడుపుని శుభ్రపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. సొరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
టమాట..
టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్), ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే యాంటీఆక్సిడెంట్. అంతే కాకుండా ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. టమాట లేదా టమాట రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
పాలకూర..
పోషకాల ఎక్కువగా కలిగి ఉన్న పచ్చి ఆకు కూరలలో పాలకూర కూడా ఒకటి. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది.
ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించ డంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.
బ్రకోలీ..
బ్రకోలీ రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ అనే మూలకం మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రకోలీలో సమృద్ధిగా ఉండే ఫైబర్ శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాకుండా, విటమిన్ సి , విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com