తమలపాకుల కషాయం తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు..  

సాక్షి లైఫ్ : సాక్షి లైఫ్ : తమలపాకుల కషాయం అనేక వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలన్నా లేదా జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా తమలపాకుల కషాయాన్ని తాగడం ద్వారా ఆయా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఈ కాషాయం  తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 
తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలి కాలంలో తమలపాకు కషాయం తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడటమే కాకుండా, అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. తమలపాకులు ఔషధ గుణాల నిధి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఎలిమెంట్స్ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. 

ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

జీర్ణవ్యవస్థ.. 

తమలపాకుల కషాయం జీర్ణ శక్తిని పెంచుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

శ్వాసకోశ సమస్యలకు..  

ఊపిరితిత్తులలో మంటను తగ్గించడంలో సహాయపడే తమలపాకులలో యాంటీఆక్సిడెంట్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఆస్తమా , బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 

ఒత్తిడి,ఆందోళన.. 
 
తమలపాకులో ఉండే మూలకాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడితో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

దంతాలు-చిగుళ్ళకు మేలు.. 

తమలపాకుల కషాయంతో పుక్కిలించడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలైన దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్లలో రక్తం కారడం మొదలైనవి నయమవుతాయి. ఇది నోటి అల్సర్లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి.. 

తమలపాకుల కషాయం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ముఖ్యంగా  చలికాలంలో ఈ కాషాయాన్ని రోజూ తాగితే, ఇది అనేక రకాల వ్యాధులతో పోరాడడంలో శరీరానికి సహాయపడుతుంది. 

 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health betel-leaf betel-leaf-water betel-leaf-benefits betel-leaf-health-benefits betel-leaves benefits-of-betel-leaf health-benefits-of-betel-leaf betel-leaves-benefits health-benefits-of-betel-leaves betel-leaves-kashayam benefits-of-betel-leaves benefits-of-drinking-betel-leaf-water benefits-of-eating-betel-leaves amazing-health-benefits-of-betel-leaves antiseptic-benefits-of-betel-leaves betel-leaves-drink betel-leaves-kashayam-in-telugu

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com