బీ అలెర్ట్ : కాలేయ వ్యాధులకు ఇవే ప్రధాన కారణాలు.. ?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, జీవనశైలి అలవాట్లలోనూ, ఆహారపు అలవాట్లలోనూ, తగిన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన కాలేయం కోసం, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, సురక్షితమైన శారీరక సంబంధాలు, పరిశుభ్రత అనేవి చాలా ప్రధానం.

కాలేయ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

ఆహారపు అలవాట్లు...  

అధిక కొవ్వు, చక్కెర, ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువగా తినడం.
మద్యం సేవించడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. 

హెపటైటిస్ వైరస్:

హెపటైటిస్ A, B, C, D, E వంటి వైరసుల ద్వారా కాలేయం దెబ్బతింటుంది.  

ఫ్యాటీ లివర్.. 

నాన్-ఆల్కహలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD) ఆల్కహలిక్ ఫ్యాటీ లివర్ (AFLD) కాలేయం లో కొవ్వు మోతాదుపెరిగి దాని పనితీరు క్షీణిస్తుంది.

మధుమేహం.. 

రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండడం వలన కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది, దీని ఫలితంగా కాలేయం దెబ్బతింటుంది.

 

ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

వారసత్వం.. 

కుటుంబంలో ఎవరైనా కాలేయ వ్యాధి ఉంటే కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.

 హానికర రసాయనాలు 

కాలేయం పై రసాయనాలు, మందులు (ఉదా: హెపటోటాక్సిక్ డ్రగ్స్) లేదా రసాయనాలు ఎక్కువగా ప్రభావితం చేస్తే కాలేయ వ్యాధులు వస్తాయి.


జెనెటిక్ డిస్ఆర్డర్స్ వంటి "హేమోక్రమటోసిస్" లేదా "విల్సన్స్ డిసీజ్ వలన కూడా కాలేయం చెడిపోతుంది.

ఊబకాయం..  

అధిక బరువు ఉండటం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
 

కాలేయ వ్యాధి ఇతర లక్షణాలు.. 

 కాలేయ వ్యాధికి సంబంధించిన కొన్ని ఇతర సాధారణ లక్షణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో:
ఆయాసం
దురద చర్మం
వికారం లేదా వాంతులు
మలం రంగులో మార్పు
కడుపు నొప్పి, వాపు
 మూత్రం రంగులో మార్పు 
చర్మం, కళ్ళు పసుపు.. 

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

 ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.