ద్రాక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. చలికాలంలో తింటే..  

షేర్ చేయండి:
ద్రాక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. చలికాలంలో తింటే..  

సాక్షి లైఫ్ : శీతాకాలంలో ద్రాక్ష తింటే, ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో  మార్కెట్‌లో రకరకాల కూరగాయలు ఉన్నా, పండ్లకు ఎక్కువగా డిమాండ్  ఉంటుంది. అటువంటి పండ్లలో ఒకటి ద్రాక్ష. సాధారణంగా నలుపు ,ఆకుపచ్చ ద్రాక్షలు మార్కెట్‌లో లభిస్తాయి. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. సోడియం, పొటాషియం, సిట్రిక్ యాసిడ్, ఫ్లోరైడ్, ఐరన్ వంటి అనేక పోషకాలు ద్రాక్షలో ఉన్నాయి. ద్రాక్షలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. శీతాకాలంలో ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు  తెలుసుకుందాం.. 

క్యాన్సర్‌ను నివారణలో..  

ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరంలో ఉండే కణాలను రక్షించడానికి ఈ మూలకాలు పనిచేస్తాయి. ద్రాక్షను తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ,మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అందువల్ల, ద్రాక్షను శీతాకాలంలో తప్పనిసరిగా తినాలి.

 

ఇది కూడా చదవండి..డిసీజ్ ఎక్స్ కరోనా కంటే తీవ్రమైందా..?

ఇది కూడా చదవండి..ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్యం..

ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

రక్తపోటు నియంత్రణ..  

అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లయితే, వారు చలికాలంలో ఖచ్చితంగా ద్రాక్షను తినాలి. నిజానికి ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు వారంలో నాలుగైదు రోజులు ద్రాక్షపండ్లు తినడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. 

కళ్లకు మేలు..  

ద్రాక్షలో విటమిన్ "ఏ" పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఆహారంలో ద్రాక్షను చేర్చుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా, డయాబెటిక్ రోగుల తీపి పదార్థాలు తినాలనే కోరికను తగ్గించడానికి ద్రాక్ష తినవచ్చు.రక్తహీనత ఉన్నవారు తప్పనిసరిగా ద్రాక్షను తినాలి. 
 

రక్తహీనత లేదా రక్త లోపంతో బాధపడేవారు తప్పనిసరిగా ద్రాక్ష తినాలి. ద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం, నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు  ఉన్నవారు ద్రాక్ష తినడం ద్వారా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

 మెరిసే చర్మం..  

యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ద్రాక్షలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, అకాల వృద్ధాప్యం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతాయి. ద్రాక్షలో విటమిన్ "ఇ" కూడా ఉంటుంది, ఇది చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.