టాటూ వేయించుకుంటే ఎయిడ్స్ వస్తుందా..?  

సాక్షి లైఫ్ : టాటూ వేయించుకోవడం ద్వారా ఎయిడ్స్ వస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. టాటూ వేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే, రక్త మార్పిడితో సంబంధం ఉన్న ఇతర వ్యాధులు హెచ్ఐవీ వంటివి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు ఉందాహరణే ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగిన సంఘటన. 

 అక్కడ 'టాటూ' వేయించు కున్న68 మంది మహిళలకు ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. హెచ్‌ఐవి పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. చాలా మంది రోడ్‌సైడ్ ఉండే వారి దగ్గర  వేయించిన టాటూల వల్ల ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం ఆసుపత్రి తనిఖీల్లో వెల్లడయ్యింది.  

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

యూపీలోని ఘజియాబాద్‌లోని మహిళా ఆస్పత్రిలో ప్రసవానికి ముందు జరిపిన వైద్య పరీక్షల నివేదికలో గత నాలుగేళ్లలో 68 మంది మహిళలకు హెచ్‌ఐవీ సోకినట్లు వెల్లడైంది. ఈ మహిళలకు కౌన్సెలింగ్‌ చేయగా.. వారంతా రోడ్డు పక్కన టాటూలు వేయించుకున్నట్లు తేలింది. ఈ విధంగా, టాటూల అభిరుచి వారందరినీ ఎయిడ్స్ బారీన పడేలా చేసింది.

 
 టాటూస్ కారణంగా.. 

కౌన్సెలింగ్ సమయంలో రోడ్డు పక్కన టాటూ ఆర్టిస్ట్ ల వద్ద టాటూస్ వేయించుకున్నట్లు బాధిత మహిళలు చెప్పారు. తమకు హెచ్‌ఐవీ  ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి రోడ్డు పక్కన టాటూసే ప్రధాన కారణమని బాధితులు వాపోతున్నారు. టాటూ వేయించుకున్న తర్వాత తమ ఆరోగ్యం క్షీణించిందని వారు వెల్లడించారు.

ఒరిజినల్ టాటూ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు, కానీ అదే సూదితో చాలా మంది టాటూలు వేయించుకోవడం వల్ల హెచ్ ఐవీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక వ్యక్తి ఎయిడ్స్‌తో బాధపడుతూ, అతను టాటూ వేయించుకుని, అదే సూదితో మీరు కూడా టాటూ వేయించుకుంటే, మీరు హెచ్ ఐవీ బారిన పడే ప్రమాదం ఉంది. 

జిల్లా ఆసుపత్రి కౌన్సెలర్ ఉమా సింగ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 15 నుంచి 20 మంది మహిళలు హెచ్‌ఐవి బారిన పడుతున్నారని చెప్పారు. 
హెచ్‌ఐవీ సోకిన మహిళలందరికీ సురక్షిత ప్రసవం చేశామని ఆయన తెలిపారు. టాటూ వేయించుకున్న తర్వాత సూదిని మళ్లీ ఉపయోగించడంవల్లే హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందని ఆయన అన్నారు.

టాటూ కోసం ప్రతిసారీ ఖచ్చితంగా కొత్త సూదులు వాడాలని డాక్టర్లు  చెబుతున్నారు. టాటూ వేసుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం 0.3 శాతం ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి సోకిన వ్యక్తికి వాడిన సూది వేరొకరికి వాడితే వెంటనే రక్తమార్పిడి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి టాటూ వేసుకునేటప్పుడు హెచ్ ఐవీ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుందని ప్రతిఒక్కరూ గమనించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : tattoo tattoos tattoo-aftercare tattoo-removal laser-tattoo-removal precautions-after-tattoo tattoo-healing what-happens-after-laser-tattoo-removal before-and-after-precautions-for-tattoo tattoo-after-care before-and-after-tattoo-removal tattoo-removal-before-and-after tattoo-precautions-and-proper-aftercare tattoo-removal-process precautions-for-a-tattoo up-women-hiv-tattoo ghaziabad-tattoo-hiv aids-ghaziabad-tattoo ghaziabad-tattoo-hiv-infection how-tattooing-in-up-led-to-aids-for-68-women tattoo-needle-hiv-infection tattoo-leads-to-aids-up tattoo-safety-risks health-risks-tattoo tattoo-infection-risks tattoo-artist-infection health-warning-tattoo-artists tattoo-safety-india
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com