సాక్షి లైఫ్ : బరువు తగ్గించే చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేసి, ఆ చికిత్స వల్ల కస్టమర్‌కు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టిన ఒక స్లిమ్మింగ్, వెయిట్ లాస్ క్లినిక్‌కు రంగారెడ్డి జిల్లా వినియోగ దారుల వివాదాల పరిష్కార కమిషన్ (Consumer Commission) భారీ జరిమానా విధించింది. చికిత్స ఫీజు రూ.2,47,800ను వార్షికంగా 9 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, అంతేకాక మానసిక వేదన (Mental Agony) న్యాయ పోరాట ఖర్చుల కింద అదనంగా రూ.20,000 చెల్లించాలని కోఠాపేటలోని సదరు క్లినిక్‌ను కమిషన్ ఆదేశించింది.
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
చికిత్సతో పెరిగిన సమస్యలు..
ఓంకార్ వాహిని అనే కస్టమర్, 2024 జనవరిలో క్లినిక్‌లో సమగ్ర వెయిట్ లాస్ ప్యాకేజీ కోసం పూర్తి మొత్తాన్ని ముందుగానే చెల్లించారు. స్లిమ్మింగ్ ప్రక్రియలు ప్రారంభించిన కొద్ది సెషన్‌లకే ఆమెకు శరీరంపై తీవ్రమైన దురద (Severe Itching), మంటలు, అధిక చెమట, మూత్ర సమస్యలు (Urinary Discomfort),డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఈ సమస్యలను క్లినిక్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా, వారు వాటిని పట్టించుకోలేదని (Allegedly Ignored) ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐదు సెషన్‌ల తరువాత..
ఐదు సెషన్‌ల తరువాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో, 2024 ఫిబ్రవరి ప్రారంభంలో ఆమె ఉదర శస్త్రచికిత్స (Abdominal Surgery) చేయించుకోవాల్సి వచ్చింది. ఆరోగ్య సమస్యల తీవ్రత దృష్ట్యా, ఆమె గైనకాలజిస్ట్ కూడా స్లిమ్మింగ్ విధానాన్ని నిలిపివేయాలని సలహా ఇచ్చారు.
వైద్యపరమైన సమస్యల కారణంగా చికిత్స కొనసాగించలేనందున ఫీజును తిరిగి చెల్లించాలని కస్టమర్ క్లినిక్‌ను కోరగా.. కస్టమర్ "స్వచ్ఛందంగా విరామం తీసుకున్నారని" వాదిస్తూ, డబ్బు వాపసు ఇవ్వడానికి క్లినిక్ నిరాకరించింది.
కమిషన్ తీర్పులో కీలక విషయాలు..
క్లినిక్ వాదనలను కన్స్యూమర్ కమిషన్ తిరస్కరించింది. కస్టమర్ ఆరోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా చికిత్సను కొనసాగించడం 'సేవల్లో లోపం'(Deficiency in Service) కిందికి వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.
డబ్బులు చెల్లించినప్పటికీ పూర్తి సేవలు అందించకుండా, వైద్య సమస్యల కారణంగా చికిత్స ఆపివేసిన వారికి కూడా డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం అన్యాయమైన వ్యాపార పద్ధతి (Unfair Trade Practice)అని పేర్కొంది. క్లినిక్ తప్పిదాన్ని గుర్తించి, కస్టమర్‌కు జరిగిన నష్టానికి, మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని కమిషన్ తీర్పు చెప్పింది.
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com