పొద్దుతిరుగుడు గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..?
సాక్షి లైఫ్ : పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ బి1 లేదా థయామిన్ ఉంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. శరీరం కార్బోహైడ్రేట్‌లను శక్తిగా ఉపయోగించడానికి ఇది సహాయపడుతుంది. విటమిన్ బి1 లోపం సాధారణంగా బెరిబెరి వ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు నరాల సంబంధిత రుగ్మతలు కూడా పెంచుతుంది.
ఇది కూడా చదవండి..పారాసెటమాల్‌తో సహా 53 మందులు పరీక్షల్లో విఫలమయ్యాయి.. ఇదిగో పూర్తి జాబితా..
ఇది కూడా చదవండి..గర్భధారణ సమయంలో భాగస్వామితో కలవవచ్చా..?
ఇది కూడా చదవండి..పంటి నరాలకు, కంటి నరాలకు.. లింక్ ఉందా..?
విటమిన్స్..
పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్లు బి2, బి3, బి6, సి, ఇ అండ్ కె వంటి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి1ను పొందవచ్చు.
ఇది కాకుండా, విటమిన్ బి1లోపిస్తే బరువు తగ్గడం, అనోరెక్సియా సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా సంభవించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
పొద్దుతిరుగుడు గింజల్లో..
ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి1ను పొందవచ్చు. అటువంటి వాటిలో సన్ ఫ్లవర్ సీడ్స్ చాలా ముఖ్యమైనవి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి1 తగినంత మొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 0.106ఎంజీ, విటమిన్ బి1 పొందవచ్చు.
ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?
ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
