గర్భధారణ సమయంలో భాగస్వామితో కలవవచ్చా..?
సాక్షి లైఫ్ : గర్భధారణ అనేది మహిళలకు ఒక అందమైన దశ అలాగే సవాళ్లతో కూడిన సమయం కూడా. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, ఇది మానసికంగా కూడా సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకునే ముందు లేదా ఏదైనా వ్యాయామం చేసే ముందు కూడా గర్భంలోని శిశువు భద్రత గురించి ఆలోచించాలి. అటువంటి పరిస్థితిలో చాలా మంది మహిళలు లైంగిక జీవితం గురించి గందరగోళానికి గురవుతారు. గర్భధారణ సమయంలో భాగస్వామితో శారీరక సంబంధం కలిగి ఉండటం ఎంతవరకు సరైనది..? అలా చేయవచ్చాలేదా..? అనేదానిపై లైంగిక ఆరోగ్య నిపుణులు ఏమి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..పంటి నరాలకు, కంటి నరాలకు.. లింక్ ఉందా..?
ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?
ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి..
గర్భధారణ సమయంలో ..
గర్భధారణ సమయంలో మహిళలు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌లో పాల్గొనాలా వద్దా..? బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉందా? ఇలాంటి ప్రశ్నలు ప్రతి గర్భిణి మదిలో మెదులుతుంటాయి. ఈ ప్రశ్నకు ఒక్క లైన్‌లో సమాధానమిస్తే, గర్భధారణ సమయంలో సెక్స్ పూర్తిగా సురక్షితమైనదని, అయితే గైనకాలజిస్ట్ సలహా తీసుకోవాలని, వారి సలహా మేరకే నడుచుకోవడం మేలని లైంగిక ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మొదటి, చివరి త్రైమాసికంతో పోలిస్తే..
మొదటి, చివరి త్రైమాసికంతో పోలిస్తే, రెండవ త్రైమాసికం సెక్స్‌కు అత్యంత సురక్షితమైన సమయంగా పరిగణిస్తారు. ప్లాసెంటా ప్లేస్‌మెంట్, అధిక గర్భస్రావం ప్రమాదం ఇతర తీవ్రమైన సమస్యల విషయంలో సెక్స్ చేయడం ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ దిశలో ముందుకు వెళ్లే ముందు గైనకాలజిస్ట్‌ని తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాదు వారు సూచించిన సూచనలనే పాటించాలి.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
