ఫ్యాటీ లివర్ సమస్యను మీరు ఇంట్లోనే గుర్తించగల ఐదు సంకేతాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : ఫ్యాటీ లివర్ సమస్య విషయంలో కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. దీని కారణంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ప్రారంభ దశలో నిర్ధారణ కాకపోవచ్చు. అయితే ముందుగా వ్యాధి లక్షణాలను గుర్తించడం ద్వారా చికిత్స అందించవచ్చు. ముఖ్యంగా ఈ సమస్యను నివారించడానికి ఆయా వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా అవసరం. ఫ్యాటీ లివర్ ను గుర్తించడానికి ఐదు సంకేతాలను సులభంగా గుర్తించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటంటే..?  

 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

  ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించే ఐదు సంకేతాలు..

1. జీర్ణ సమస్యలు.. 

తరచుగా ఫ్యాటీ లివర్‌ ఉన్నప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇవి కాలేయ పనితీరులో మార్పులను సూచిస్తాయి. 

2. అలసట.. 
 అలసిపోయినట్లు అనిపిస్తే, మీ కాలేయం దాని ముఖ్యమైన విధులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతోందని సూచిస్తుంది.

3. కుడి పక్కటెముక కింద అసౌకర్యంగా  లేదా నొప్పిగా అనిపిస్తుంది.. 
ఈ ప్రాంతంలో నొప్పి లేదా అసౌకర్యం కాలేయ వాపునకు సంకేతం కావచ్చు, తద్వారా కాలేయ సమస్య ఉన్నట్లు గమనించాలి.  

4. చర్మ సమస్యలు.. 
కొవ్వు కాలేయంతో సంబంధం ఉన్న ఇన్సులిన్ నిరోధకత మొటిమలు,  చర్మంనల్లబడడం, ముడతలు పడడం లేదా జుట్టు రాలడానికి దారితీస్తుంది, ఇవన్నీ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు కనిపించే సంకేతాలేనని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

5. వికారం, ఆకలి లేకపోవడం..  

ఆకలిగా లేకపోవడం, ఒకవేళ తిన్నతర్వాత వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఫ్యాటీ లివర్ ఉందని సూచిస్తాయి. 

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : fatty-liver fatty-liver-symptoms fatty-liver-diet fatty-liver-disease fatty-liver-treatment how-to-cure-fatty-liver eggs-are-bad-for-fatty-liver drink-this-for-a-fatty-liver-and-gallstones reverse-fatty-liver best-drink-for-fatty-liver remedies-for-a-fatty-liver fatty-liver-diet-plan symptoms-of-fatty-liver what-are-the-best-fruits-for-fatty-liver? omega-3-fatty-acids omega-3-fatty-acid omega-3-fatty-acids-benefits fatty-acids omega-3-fatty-acid-benefits non-alcoholic-fatty-liver-disease fatty-liver-causes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com