అధిక రక్తపోటుకు దారితీసే 7 ముఖ్య కారణాలు..!

సాక్షి లైఫ్: అధిక రక్తపోటు.. ఒక సైలెంట్ కిల్లర్..! ఇది శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదు. ఎలాంటి స్పష్టమైన సంకేతాలు బయటకు కనిపించవు. కానీ, రక్తపోటుపై, గుండె ఆరోగ్యంపై మాత్రం తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఇంత ప్రమాదకరమైన ఈ పరిస్థితికి అసలు కారణాలేమిటి?

 

ఇది కూడా చదవండి..4-7-8 బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ అంటే ఏమిటి..? నిద్రకు ఎలా ఉపయోగపడుతుంది..? 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో, ఒత్తిడితో నిండిన జీవనశైలిలో అధిక రక్తపోటు (హై బీపీ) ఒక పెను సమస్యగా మారింది. దీని లక్షణాలు అంత తొందరగా బయటపడకపోవడంతో, ఇది మనలో చాలా మంది ఆరోగ్యాన్ని, ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వయసు పైబడటం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, మధుమేహం, ధూమపానం వంటి కొన్ని ప్రధాన కారణాలు. అయితే, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరికొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..? 

 వాయు కాలుష్య ముప్పు.. 

గాలిలో ఉండే ప్రమాదకరమైన కాలుష్య కణాలు నేరుగా మీ రక్తప్రవాహంలో కలిసిపోతాయి. ఫలితంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందుకే, పట్టణాల్లో పొల్యూషన్ ను వీలైనంత వరకు నివారించడం చాలా ముఖ్యం. కాలుష్యం శీతాకాలంలో మీ బీపీని కూడా పెంచుతుంది. ఒక్క శీతాకాలంలోనే కాదు, ఏడాది పొడవునా వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము వంటి వాటితో మనం నిత్యం చుట్టుముట్టబడి ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి.

 స్లీప్ అప్నియా..  

 బిగ్గరగా గురక పెడుతున్నారా? పగటిపూట విపరీతమైన బద్ధకం, నిద్రమత్తుగా ఉంటుందా? లేదా మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం అంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయికి చేరుకుందని అర్థం. అయితే, దీనికి సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 కొన్ని రకాల మందులు..  

గుండె సంబంధిత సమస్యలు ఉన్న మధ్య వయస్కులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, ఎటోకాక్సిబ్ వంటి నొప్పి నివారణ మందులు అధిక రక్తపోటుకు కారణమవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ మందులను ఎక్కువగా వాడటం మంచిది కాదు. నొప్పిగా ఉంటే వీటికి బదులుగా పారాసెటమాల్ తీసుకోవడం సురక్షితం.

 దీర్ఘకాలిక ఒత్తిడి..   

పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు మనిషిని తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. ఇది అలసటకు దారితీయడమే కాకుండా, రక్తపోటును కూడా పెంచుతుంది. నిద్ర పట్టడం లేదని వెంటనే నిద్రమాత్రలు వేసుకోవడానికి బదులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి.

 నిద్రలేమి.. 

మధ్య వయస్సులో చాలా మందిలో రక్తపోటు పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. కానీ చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి, ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. రాత్రిపూట టీవీ చూడటం, ఆలస్యంగా నిద్రపోవడం, అర్థరాత్రి వరకు చిరుతిళ్లు తినడం వంటి అలవాట్లను మానుకోవాలి.

గర్భధారణ సమయంలో..  

గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో, గర్భిణులు తమ బీపీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం చాలా ముఖ్యం.

 ఇతరుల పొగ కూడా ప్రమాదమే!

ఇంట్లో ఎవరైనా ధూమపానం చేస్తుంటే, ఆ పొగను పీల్చడం వల్ల (సెకండ్‌హ్యాండ్ స్మోక్) ఇతరులకు కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తుంటే వారిని మాన్పించడానికి ప్రయత్నించండి లేదా వారికి దూరంగా ఉండండి.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : ayurvedic-drinks high-bp aloe-vera-gel hypothyroidism hypertension world-hypertension-day world-hypertension-day-2024-theme high-blood-pressure blood-pressure high-blood-pressure-symptoms hyperthyroidism how-to-lower-blood-pressure high-blood-pressure-control high-blood-pressure-diet lower-blood-pressure how-to-lower-high-blood-pressure foods-for-high-blood-pressure best-foods-for-high-blood-pressure high-blood-pressure-treatment foods-to-lower-blood-pressure high-blood-pressure-causes how-to-lower-blood-pressure-naturally dash-diet-for-hypertension pulmonary-arterial-hypertension potassium-and-blood-pressure potassium-for-high-blood-pressure potassium-for-blood-pressure blood-pressure-control high-triglycerides international-blood-pressure-day-2025 international-blood-pressure-day--2025
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com