చలికాలంలో ఉసిరికాయను ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..  

సాక్షి లైఫ్ : శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. చలికాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చలికాలంలో ఉసిరికాయ తినడం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.. 

 చలికాలంలో ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం ఉసిరిని ఆరోగ్య లక్షణాల నిధిగా పరిగణిస్తారు. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

రోగనిరోధక శక్తి..  

విటమిన్ సి స్టోర్‌హౌస్, ఉసిరి విటమిన్ "సి"కి ఉత్తమ మూలం. విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు మరియు ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి మన శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. తెల్ల రక్త కణాలను పెంచుతుంది. ఉసిరి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం..  

 ఉసిరి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. ఉసిరిలో డైజెస్టివ్  ఎంజైమ్‌లను మరింత యాక్టివేట్ చేసి, ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఉసిరి ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం.. 

ఉసిరి చర్మాన్ని మెరిసేలా, మృదువుగా మార్చడంలో సహాయపడు తుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉసిరి సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలిలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాదు జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జుట్టును బలపరుస్తుంది. తలని ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. జుట్టుకు మేలు చేస్తుంది. ఉసిరి జుట్టును నల్లగా, మెరిసేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యం.. 

ఉసిరి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.రక్తపోటును నియంత్రిస్తుంది. ఎప్పటికప్పుడు బీపీ అదుపులో ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఉసిరి మధుమేహాన్ని నియంత్రించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : indian-gooseberry amla-benefits indian-gooseberry-benefits health-benefits-of-indian-gooseberry benefits-of-amla amla-health-benefits amla-juice-benefits health-benefits-of-amla-powder indian-gooseberry-health-benefits gooseberry-benefits health-benefits-of-amla benefits-of-indian-gooseberry amla-powder-benefits amla-benefits-for-skin amla-benefits-for-hair gooseberry indian-gooseberry-juice
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com