"ఓఆర్ ఎస్" పేరుతో స్వీట్ డ్రింక్స్ అమ్మడం నేరం: ఆరోగ్య శాఖ హెచ్చరిక..

సాక్షి లైఫ్ : ఓఆర్ ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) పేరుతో వినియోగదారులను తప్పుదారి పట్టించే వారిని హెచ్చరించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కొన్ని కంపెనీలు "ఓఆర్ ఎస్" గా స్వీట్ డ్రింక్స్ ను విక్రయిస్తున్నాయి. "ఓఆర్ ఎస్" అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆరోగ్య శాఖ అధికారులు నిషేధించారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. వ్యాపారులు నియమాలను పాటించాలని, వినియోగదారులు  జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

ఉల్లంఘనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తప్పుడు సమాచారం, తప్పుదారి పట్టించే ప్రకటనల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

"ORS" పేరుతో తీపి పానీయాలను అమ్మడం చట్టరీత్య నేరం.. 

కొన్ని కంపెనీలు తమ  స్వీట్ డ్రింక్స్ ను "ORS" (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్)పేరుతో మార్కెటింగ్ చేయడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని, వాస్తవానికి ఓఆర్ ఎస్ అనేది ఒక మెడిసినల్ సొల్యూషన్. ఇది శాస్త్రీయంగా నిర్ణయించిన నిష్పత్తి ప్రకారమే ఉప్పు, చక్కెర కలిగి ఉంటుంది. ఈ సొల్యూషన్ శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ లోపాలను భర్తీ చేయడానికి రూపొందిస్తారు. దాని (ఫార్ములేషన్) సూత్రీకరణను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించింది.

  
ORS అనే పదాన్ని ఉపయోగించడం పూర్తిగా నిషేధం.. 

ఆహారం లేదా పానీయాల ఉత్పత్తి పేరు, బ్రాండ్ లేదా లేబుల్‌లో "ORS" అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆరోగ్య శాఖ నిషేధించిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఆయా కంపెనీలు లేదా విక్రేతలపై జరిమానాతోపాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వినియోగదారులను తప్పుదారి పట్టించే ఉత్పత్తులను నిషేధించడం, మార్కెట్లో పారదర్శకతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

వ్యాపారులు అందరూ ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలని, తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారంతో ఏవైనా ఉత్పత్తులను విక్రయించకూడదని అధికారులు వెల్లడిస్తున్నారు. వినియోగదారుల ఆరోగ్యం, హక్కులను కాపాడేందుకు ఏ స్థాయిలోనైనా ఉల్లంఘనలకు పాల్పడితే, ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆరోగ్య శాఖ అధికారులు. 

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : soft-drinks energy-drinks union-health-minister health-risks-of-soft-drinks health-ministry risk-factors fake-ors-packets ors-packets side-effects-of-ors-packets ors-packets-side-effects fake-doctors-crackdown
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com