joint replacement : కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసు పైబడిన వారికి, ప్రమాదాల వల్ల లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కీళ్ల మార్పిడి (Joint Replacement) శస్త్రచికిత్స ఒక వరం. ఈ శస్త్రచికిత్స గురించి, దాని ఆవశ్యకత గురించి, అలాగే కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? అనేదాని గురించి ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ కీలక సూచనలు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. డెంగ్యూ నివారణ -  డెంగ్యూ ప్రివెన్షన్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..సూచనలు.. 

ఇది కూడా చదవండి.. రేబిస్ ప్రమాదాలను తగ్గించడానికి టీకా ఎంతమేర ప్రభావం చూపిస్తుంది..? 

ఇది కూడా చదవండి.. ఏ ఆహారాలలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి అంటే..?

 

కీళ్ల నొప్పులు..ఎందుకు వస్తాయి..?

కీళ్ల నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా వయసుతో పాటు వచ్చే కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్), రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల వాపు వ్యాధులు, కీళ్లకు జరిగిన గాయాలు, స్థూలకాయం, పోషకాహార లోపం వంటివి ప్రధాన కారణాలు. ప్రారంభ దశలో మందులు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులతో ఉపశమనం పొందవచ్చు. అయితే, నొప్పి తీవ్రమై, దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించినప్పుడు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం అవుతుంది.

 

కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం అంటే..?

 

తీవ్రమైన నొప్పి: మందులతో, ఇతర చికిత్సలతో తగ్గని తీవ్రమైన కీళ్ల నొప్పి ఉన్నప్పుడు.

కదలికలో మార్పులు : కీళ్ల కదలిక తగ్గిపోయి, నడవడానికి, నిలబడటానికి, కూర్చోవడానికి ఇబ్బంది కలిగినప్పుడు.

నిత్య కార్యకలాపాలకు ఆటంకం: నొప్పి కారణంగా రోజువారీ పనులు చేసుకోలేకపోయినప్పుడు. కీళ్ల వైకల్యం: కీళ్ల ఆకృతి మారిపోయి, వైకల్యం ఏర్పడినప్పుడు.

 

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.