ఎంపాక్స్ వైరస్ న్యూ వేరియంట్..
సాక్షి లైఫ్ : ఎం పాక్స్ సంక్రమణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ వ్యాధికి సంబంధించి జనాలకు అనేక సందేహాలున్నాయి. న్యూ స్ట్రెయిన్ క్లాడ్ 1బి ఎం పాక్స్ వైరస్ మునుపటి వేరియంట్‌ల కంటే చాలా ప్రమాదకరమైనది. ఇటీవల, ఈ వేరియంట్ కి సంబంధించిన కేసు థాయ్‌లాండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇది ఆసియాలో కొత్త వేరియంట్‌లో మొదటి కేసు. అందువల్ల, ఎం పాక్స్ వైరస్ కొత్త వేరియంట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి..? అవేంటంటే..?
ఇది కూడా చదవండి..కీమోథెరపీ దుష్ప్రభావాలు..?
ఇది కూడా చదవండి..ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిప్రెషన్ బాధితులు..
ఇది కూడా చదవండి..ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చు..?
ఎం పాక్స్ వైరస్ కొత్త వేరియంట్..
కోవిడ్ తర్వాత, ఇప్పుడు ఎం పాక్స్ ప్రపంచదేశాల్లో వినాశనం సృష్టిస్తోంది. ఇది మంకీ పాక్స్ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి దద్దుర్లు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ మహమ్మారి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 500 మందికి పైగా మరణించారు. దీంతో ఈ వ్యాధి ప్రజలను మరింతగా కలవరపెడుతోంది.
ప్రత్యేకించి దాని కొత్త వేరియంట్ క్లాడ్ 1బి స్ట్రెయిన్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది. దీని వ్యాప్తిని నివారించడానికి, చాలా దేశాలు బయటి నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షిస్తున్నాయి. ఆసుపత్రులలో ఎం పాక్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ముందస్తు చర్యలు చేపట్టారు. మెరుగైన చికిత్స చేసేందుకు అవసరమైన సౌకర్యాలనుసిద్ధం చేస్తున్నారు.
కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరం..?
2022, 2023 సంవత్సరాల్లో కూడా మంకీ పాక్స్ కేసులు వచ్చాయి. ఆ సమయంలో ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ కంటే క్లాడ్ 2 వేరియంట్ ప్రమాదం కొంచెం తక్కువ. క్లాడ్ 1మరింత ప్రమాదమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఎం పాక్స్ వైరస్ రూపాంతరం చెందుతోంది. దీని వల్ల కలిగే ఇన్ఫెక్షన్ కారణంగా వ్యాధి సోకిన వ్యక్తికి శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..హెమటోలాజిక్ క్యాన్సర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా ఈ ఆరు అవసరం..
ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
