Oxford Researchers New Study : ఆక్స్‌ఫర్డ్ రీసెర్చర్స్ న్యూ స్టడీ: ఫ్లూ నుంచి రక్షించే విటమిన్ డి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చలికాలంలో వేధించే అనారోగ్యసమస్యల్లో ఫ్లూతోపాటు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరింతగా ఇబ్బంది పెడుతూ ఉటాయి. అటువంటి వాటి నుంచి రక్షించడంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలో తగినంత విటమిన్-డి ఉండటం వల్ల ఫ్లూ ముప్పు తగ్గడమే కాకుండా, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా అడ్డుకోవచ్చని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

 

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..?

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

 

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సరైన పరిష్కారం.. 

సాధారణంగా ఎముకల బలానికి విటమిన్-డి అవసరమని మనందరికీ తెలుసు. అయితే, ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో ఈ పోషకం రక్షణ కవచంలా నిలుస్తుందని పరిశోధకులు వివరించారు.

పరిశోధనలో తేలిన ప్రధాన అంశాలు ఏమిటంటే..? 

విటమిన్-డి శరీరంలోని తెల్ల రక్తకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియాలపై పోరాడే శక్తిని ఇస్తుంది. రక్తంలో విటమిన్-డి స్థాయిలు సరిగ్గా ఉన్నవారికి ఇన్ఫెక్షన్ సోకినా, దాని తీవ్రత తక్కువగా ఉంటోందని.. తద్వారా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 50శాతం వరకు తగ్గుతుందని గుర్తించారు. కాలానుగుణంగా వచ్చే ఫ్లూ (Influenza) బారిన పడకుండా ఉండటంలో ఈ విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

విటమిన్-డి ఎలా పొందాలి..?

ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో ఉండటం వల్ల శరీరం సహజంగానే విటమిన్-డిని తయారు చేసుకుంటుంది. గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు, పాలలో ఈ పోషకం లభిస్తుంది.శరీరంలో విటమిన్-డి లోపం ఎక్కువగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.

 గమనించాల్సిన అంశాలు ఏమిటంటే..? 

విటమిన్-డి లోపం వల్ల కేవలం ఎముకల బలహీనతే కాకుండా, తరచూ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వారు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.