సాక్షి లైఫ్ : యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. మూత్రపిండాలు దానిని మన శరీరం నుంచి తొలగిస్తాయి, కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ హెచ్చరిక సంకేతాలు కొన్ని మూత్రంలో కనిపిస్తాయి. వీటిని మనం సాధారణంగా విస్మరిస్తాము. కానీ అలాంటి సంకేతాలను ఏమాత్రం విస్మరించకూడదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు మూత్రంలో కూడా లక్షణాలు కనిపిస్తాయి.
యూరిక్ యాసిడ్ పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. దానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలలో కొన్ని మూత్రంలో కూడా కనిపిస్తాయి. అవేంటంటే..? యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడు తుంది. సాధారణంగా, మూత్రపిండాలు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను మూత్రం ద్వారా తొలగిస్తాయి.అయితే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు లేదా శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
మూత్రం రంగు ముదురు రంగులోకి మారడం: సాధారణం కంటే ముదురు పసుపు లేదా గోధుమ రంగులో ఉండటం యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయని సంకేతం కావచ్చు. నురుగుతో కూడిన మూత్రం: యూరిక్ యాసిడ్ స్ఫటికాలు నురుగుతో కూడిన మూత్రానికి కారణమవుతాయి.తరచుగా మూత్ర విసర్జన: యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది, దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి - మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఉండవచ్చు.
ఇది కూడా చదవండి.."టీ" తాగడం మానేస్తే రక్తపోటు నుంచి విముక్తి కలుగుతుందా..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి "టీ" తాగడం కూడా ఒక కారణమేనా..?
ఇది కూడా చదవండి..ఆయుర్వేదంలో కూరగాయలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com