సమ్మర్ లో ఉదయాన్నే నిమ్మరసం నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీరు తాగడం అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయ పడుతుంది. ఇది పాతకాలం నుంచి మన పెద్దలు పాటిస్తూ వచ్చిన ఆరోగ్య రహస్యాల్లో ఒకటి. నిమ్మరసం నీటిని ప్రతిరోజూ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, చర్మం మెరిసి పోతుంది.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

   శరీరానికి హైడ్రేషన్.. 

ఉదయాన్నే నిమ్మరసం నీరు తాగడం ద్వారా శరీరానికి తగినంత నీటి సమతుల్యత అందుతుంది, ఇది ఆరోగ్యానికి అత్యంత అవసరం.

  రోగనిరోధక శక్తి.. 

నిమ్మరసం‌లో ఉండే విటమిన్ సి శరీరానికి బలాన్ని ఇస్తుంది. దీని వల్ల సీజనల్ జలుబు, ఫ్లూ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 జీర్ణక్రియకు.. 

నిమ్మరసం నీరు జీర్ణక్రియను ప్రోత్సహించి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

 చర్మం మెరుస్తుంది.. 

విటమిన్ సి చర్మ కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తూ, ముడతలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.

 కిడ్నీ రాళ్ల నివారణ.. 

నిమ్మరసం‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్ర మార్గాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇది కిడ్నీ రాళ్ల ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.

 జాగ్రత్తలు అవసరం.. 

 ప్రమాదం: నిమ్మరసం‌లో ఉన్న యాసిడ్ దంతాల ఎముకలను దెబ్బతీయవచ్చు. కాబట్టి స్ట్రాతో తాగడం మంచిది.

అజీర్ణ సమస్యలు: కొంతమందికి యాసిడిటీ ఉంటుంది. అలాంటివారు నిమ్మరసం నీరు తాగకూడదు. ఇటువంటి వారు వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం.

ఎప్పుడు, ఎలా తాగాలి..?
 

ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమం.. 

గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ రసం కలిపి తాగితే శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ తేనే కూడా కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 

సహజమైన,తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే నిమ్మరసం నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి శక్తి, చర్మానికి అందం, ఆరోగ్యానికి రక్షణ లభిస్తాయి. అయితే, ఏ ఆహార అలవాటు అయినా మితమైన పరిమితుల్లోనే పాటించడం ఉత్తమమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : summer-health-tips summer-season summer-health summer-heat digestion detoxification-of-the-body body-detox detoxify detoxification side-effects-of-lemon-juice digital-detox digital-detox-benefits natural-remedies morning-routine lemon-water-benefits morning-health-habits natural-detox-methods digestion-remedies healthy-morning-routines detox-drinks
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com